Meghasandesam Serial Today Episode: పోలీస్‌ స్టేషన్‌ ఉన్న రత్న నిజం చెప్తుందేమోనని అపూర్వ భయపడుతుంది. ఎలాగైనా రత్నను స్టేషన్‌ నుంచి తప్పించాలని లేదంటే మర్డర్‌ చేయించాలని అనుకుంటుంది. పోలీస్‌ల టార్చర్‌ భరించలేక నిజం చెప్పేస్తే తన పరిస్తితి ఏంటని ఆందోళన చెందుతుంది. తర్వాత పోలీస్‌ స్టేషన్‌ లో లేడీ కానిస్టేబుల్‌ రత్నను కోర్టుకు తీసుకెళ్లడానికి బయటకు తీసుకెళ్తుంది.

Continues below advertisement

కానిస్టేబుల్‌: చూడు నిన్ను తప్పించమని నాకు బయటి నుంచి ఫోన్ వచ్చింది. నిన్ను తప్పిస్తే.. నాకు భారీగా డబ్బు ఆఫర్‌ చేశారు. నిన్ను వేరేలాగా నేను తప్పించలేను.. కాబట్టి ఇవాళ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో నువ్వు తప్పించుకుని వెళ్లాలి.

రత్న: సరే మేడం.. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను..

Continues below advertisement

కానిస్టేబుల్‌: సరే కోర్టుకు తీసుకెళ్లే టైంలో మళ్లీ వస్తాను

అని రత్నకు చెప్పి కానిస్టేబుల్‌ వెళ్లిపోతుంది. కొద్ది సేపటి తర్వాత వచ్చిన కానిస్టేబుల్‌ , రత్నను తీసుకుని కోర్టుకు బయలుదేరుతుంది.

కానిస్టేబుల్‌: బయట జీపు ఎక్కుతున్నప్పుడు నువ్వు నన్ను తోసేసి నువ్వు అక్కడి నుంచి పారిపో.. ఎందుకంటే ఇప్పుడు బయట ఎవ్వరూ ఉండరు.. నేను మాత్రమే ఉంటాను.. అందరూ లోపల ఉన్నారు.. వాళ్లందరూ అలెర్ట్‌ అయి నిన్ను పట్టుకోవడానికి వచ్చే లోపు నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా పారిపో.. సరేనా..?

రత్న: సరే మేడం..బయట మీరు ఒక్క మాట చెప్పండి నేను పారిపోతాను.

అంటూ ఇద్దరూ బయటకు వస్తారు. జీపు దగ్గరకు రాగానే కానిస్టేబుల్‌ రత్నకు సైగ చేస్తుంది. రత్న, కానిస్టేబుల్‌ను తోసేసి పారిపోతుంది. ఏయ్‌ అంటూ కానిస్టేబుల్‌ గట్టిగా అరుస్తుంది. ఇంతలో స్టేషన్‌ లో ఉన్న పోలీసులు వస్తారు.

కానిస్టేబుల్‌: సార్‌ అది నన్ను తోసేసి పారిపోతుంది సార్‌..

ఎస్సై: అవునా..? కానిస్టేబుల్స్ వెంటనే అలర్ట్‌ చేయండి.. ఆ రత్నను పట్టుకోవాలి

అంటూ అందరూ అలెర్ట్‌ అవుతారు. ఇంతలో అక్కడి  నుంచి తప్పించుకుని వెళ్లిన రత్న నేరుగా అపూర్వ ఇంట్లోకి వెళ్లిపోతుంది. హాల్లోకి వెళ్లి అటూ ఇటూ చూస్తుండగా అప్పుడే లోపలి నుంచి ఏసీపీ సూర్య వస్తాడు. సూర్యను చూసిన రత్న షాక్‌ అవుతుంది. భయపడుతుంది.

సూర్య: తప్పించుకున్న క్రిమినల్‌ తప్పు చేసిన చోటికే పరుగెత్తుకుంటూ వస్తారని ఒకరు నాకు సలహా ఇచ్చారు. అదే ఇక్కడ జరిగింది. నిన్నెవరో తప్పించడం కాదు.. మేమే నిన్ను ట్రాప్‌ చేసి నీ వెనక ఉన్న వాళ్లను పట్టుకోవడానికి ఈ నాటకం ఆడాము..

అంటూ సూర్య చెప్పగానే.. అక్కడే ఉన్న అపూర్వ భయపడుతుంది. నిజం చెప్పొద్దని రత్నకు సైగ చేస్తుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.

సూర్య: చెప్పు మా అన్నయ్యను చంపమని నీకు ఎవరు సుపారీ ఇచ్చారు. చెప్పు నిజం చెప్పు రత్న నువ్వు వాళ్లెవరో నిజం చెప్పి వాళ్లను పట్టిస్తే నీకు పడే శిక్ష కూడా తగ్గుతుంది. ఆలోచించుకో వాళ్ల కోసం నీ జీవితం పాడుచేసుకోకు

అంటూ సూర్య చెప్తుంటే.. అపూర్వ మాత్రం చెప్పొద్దని సైగ చేస్తుంది. ఇంతలో శరత్‌ చంద్ర కోపంగా రత్నను తిడతాడు.

శరత్‌: ఈ ఇంట్లో నేను పాలు పోసి పెంచిన పాము ఎవరో తెలసుకోవాలని ఉంది చెప్పమ్మా..? నన్ను నమ్మించి నమ్మకద్రోహం చేసిన ఆ వ్యక్తి ఎవరో చెప్పమ్మా..? లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను.. చెప్పు..

అంటూ శరత్ చంద్ర గద్దించగానే.. రత్న చేయి ఎత్తి అపూర్వ వైపు చూపిస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!