Continues below advertisement

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 09 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 9th Episod

Continues below advertisement

వంటింట్లో శ్రుతి, మీనా సరదాగా మాట్లాడుకుంటారు. నువ్వు నిజంగా గ్రేట్ ఇంత జరిగినా అలా ఎలా క్షమించేశావ్ అంటుంది. అంత కోపాన్ని కూడా ఎలా కంట్రోల్ చేసుకుంటావ్ అని అడుగుతుంది. అదే నేనైతే అనగానే..ఏం చేసేదానివి అని అడుగుతుంది మీనా. నాకు అంత ఓపిక లేదు.. నన్ను ఎవరైనా ఇబ్బందిపెడితే ముక్కుపై గుద్దుతా అంటుంది. మాటలన్నీ చాటుగా వింటుంది ప్రభావతి. అదే అత్తయ్య ఏమైనా అంటే ఏం చేస్తావ్ అని అడిగితే.. మాటకు మాట దెబ్బకు దెబ్బ, ఇంకా ఇబ్బందిపెడితే అట్లకాడతో వాతలుపెడతా అంటుంది. అమ్మో దీన్ని ఎలా భరించాలి, నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి అనుకుంటుంది. వీళ్లమాటలకు బ్రేక్ వేయకపోతే మరింత దారుణాలు వినాల్సి ఉంటుంది అనుకుంటూ వంటగదిలోకి వెళుతుంది. ప్రభావతి రాగానే శ్రుతి వెళ్లిపోతుంది...మీనాపై ఫైర్ అవుతుంది ప్రభావతి. దాన్ని రెచ్చగొట్టి నాపైకి వదులుతున్నావా అంటుంది. కడుపుమంటగా ఉన్నట్టుంది మజ్జిగ తాగుతారా అంటుంది మీనా.

నాకు కాల్ వచ్చింది.. బయటకు వెళుతున్నా మళ్లీ మీకు చెప్పలేదంటారు అని చెప్పేసి బయటకు వెళ్లిపోతుంది మీనా. తర్వాత బాలు దగ్గరకు వెళ్లి క్యారేజ్ ఇచ్చి అట్నుంటి అటే పూలు కట్టేందుకు వెళుతుంది.

తనను ఏడిపిస్తున్న దినేష్ కి బుద్ధి చెప్పాలంటుంది రోహిణి. విద్య వెంటనే గుణ దగ్గరకు తీసుకెళ్తుంది. డబ్బులు అవసరం లేదు..మీ పని చేస్తాం అని మాట ఇస్తాడు గుణ. తర్వాత దినేష్ ని ఫైనాన్స్ గురించి మాట్లాడాలి రమ్మని చెప్పి పిలుస్తారు. తర్వాత ఫుల్లుగా ఉతికి ఆరేస్తారు. వాళ్లనుంచి తప్పించుకుని...పారిపోతూ బండిపై పెద్దావిడను గుద్దేస్తాడు. అప్పుడే రూట్లో వెళుతున్న బాలు, రాజేష్...వెంటనే దినేష్ ని పట్టుకుని ఉతుకుతారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న గుణ..పోలీసులకు కాల్ చేస్తాడు. పోలీసులు వచ్చి దినేష్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇదంతా ఫొటోస్ తీసి రోహిణికి పంపిస్తాడు గుణ. పోనీలే ఇక వీడి గోల వదిలిపోయింది అనుకుంటుంది. ఏంటి ఫోన్, మెసేజ్ ఎవరు చేశారని మనోజ్ అడిగితే ఏంటి గుచ్చి గుచ్చి అడుగుతున్నావ్ అని ఫైర్ అవుతుంది. నువ్వు మధ్య చిరాగ్గా మాట్లాడుతున్నావ్ అంటాడు మనోజ్.

ఇంట్లో ప్రభావతి కామాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇంతలో మీనా రావడంతో నీకు నేను అసిస్టెంట్ అందరూ వచ్చి నన్ను ఫోన్ నంబర్ అడుగుతున్నాని కోప్పడుతుంది. ఖాళీగానే ఉన్నావు కదా అంటుంది కామాక్షి. రోహిణి ఇకపై నేను నీతోపాటూ పార్లర్ కి వస్తాను అంటుంది. అమ్మో ఈవిడ చుట్టూ తిరిగి నాపై పడుతోంది ఎలాగైనా డైవర్ట్ చేయాలి అనుకుంటుంది. ఫర్నిచర్ షాప్ కి వస్తానంటుంది ప్రభావతి. మీరే సొంతంగా ఏమైనా చేయొచ్చుకదా అని..డాన్స్ స్కూల్ ప్రారంభించమని సలహా ఇస్తుంది.

మొత్తానికి ఇంట్లో అందరూ చెరో పనిలో బిజీ అయ్యారన్నమాట. మీనా పూలగంప, రోహిణి పార్లర్, శ్రుతి డబ్బింగ్, ప్రభావతి డాన్స్ స్కూల్... మనోజ్ ఫర్నిచర్ షాప్, రవి చెఫ్, బాలు డ్రైవర్ గా బిజీ బిజీ. మరి ప్రభావతి కొత్తగా ప్రారంభించిన డాన్స్ స్కూల్ లో కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి...