AP Weather Updates: ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, నార్త్ రాజస్థాన్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ మద్యప్రదేశ్‌లలో నేటి నుంచి జనవరి 6 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గింది. ఏపీ, తెలంగాణలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి వేగంగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. అయినా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కురుక్షేత్ర, రాజౌండ్, అస్సాంధ్ (హర్యానా) పరిసర ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రానున్న 2 గంటల్లో కైతాల్, నర్వానా, రాజౌండ్, అసంద్, బర్వాలా, హిస్సార్, హన్సి, సివానీ (హర్యానా) పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఏపీలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఆగ్నేయ, తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉండనుంది. ఈ ప్రాంతాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. దక్షిణ కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుకోవడం లేదు.
ఏపీలోని రాయలసీమలో నేటి నుంచి రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో అత్యల్పంగా కోస్తాంధ్రలో కళింగపట్నంలో 18 డిగ్రీలు, రాయలసీమలోని ఆరోగ్యవరంలో 18, అనంతపురంలో 18.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 18.8, నందిగామలో 19 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం గత కొన్ని రోజులుగా పొడిగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి ప్రభావం రోజురోజుకూ తగ్గుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు ఒడిశా, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై కొంతమేర ఉండటంతో చలి గాలులు వీస్తాయి.
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! రూ.210 పడిపోయిన పసిడి ధర.. వెండి మాత్రం స్వల్పంగా తగ్గుదల.. తాజా ధరలు ఇవీ..
Also Read: Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు