Continues below advertisement

 Andhra Pradesh Rains News update |  నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ తీవ్రఅల్పపీడనంగా మారే అవకాశం ఉందంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. మలక్కా జలసంధి ప్రాంతంలో సెన్యార్ తుపాన్ గా బలపడిన తీవ్రవాయుగుండం. తుపానుకు 'సెన్యార్'గా నామకరణం చేశారు. 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. విశాఖపట్నం, కొనసీమ, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో 5 నుంచి 10 సెం.మీ. వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడులో పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు.  

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్

Continues below advertisement

మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్రవాయుగుండం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈరోజు తుపానుగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

తుపాను ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు..

అల్పపీడనం, తుపాను ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వరి కోతలు జోరుగా సాగుతున్న క్రమంలో వెంటనే కుప్పలు వేసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

పండిన ధాన్యాన్ని తడవకుండా భద్రపరచుకోవాలని, తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలి సూచించింది. రంగుమారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని అన్నదాతలకు సూచించింది.