Brahmamudi Serial Today Episode: తన పేరు మీదే రాజ్‌ ఆర్‌ అనే కంపెనీ పెడుతున్నాడని తెలుసుకున్న రాహుల్‌ ఎమోషనల్‌ అవుతాడు. తనను క్షమించమని రాజ్‌ను అడుగుతాడు. దీంతో రాజ్‌, రాహుల్‌ను ఓదారుస్తాడు.

Continues below advertisement

రాజ్‌: రేయ్‌ ఏంట్రా ఇదంతా నీ మారావు.. ఒక్క అవకాశం వస్తే జీవితంలో ఎదగడానికి ట్రై చేస్తున్నావు అందుకే నీకో చాన్స్‌ ఇవ్వమని కావ్య చెప్పింది.. అందుకే నీకు ఈ అవకాశం  ఇచ్చాము.. నిలబెట్టుకోవాలి..  

రాహుల్‌: నిలబెట్టుకుంటాను రాజ్‌ మీ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటాను మాటల్లోనే కాదు నేనేంటో చేతల్లో చూపిస్తాను..   

Continues below advertisement

ఇందిరాదేవి: రుద్రాణి విన్నావా..?  ఇప్పటికైనా అర్థం అయిందా..? రాజ్‌, కావ్య అంటే ఏంటో..? గతంలో మీరు ఎన్ని తప్పులు చేసినా ఎన్నెన్ని నిందించినా నా మనవడు మనవరాలు మాత్రం మీరు బాగుండాలనే కోరుకున్నారు.. ఈ రోజు నీ కొడుకుని ఒక కంపెనీకి ఓనర్‌ను చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రవర్తించు

అపర్ణ: నా కొడుకు కోడలు ఎప్పటికీ తప్పు చేయరు.. తప్పుల్ని సరిదిద్దుతారు. ఇది మనసులో పెట్టుకుని అందరి బాగు కోరుకో రుద్రాణి.. ఇప్పటికైనా మనిషిగా మారు

కావ్య: అత్తయ్య ఈరోజు మీ పెళ్లి రోజు అందరం సంతోషంగా గడపాల్సిన రోజు ఇలాంటి సందర్భంలో ఇవన్నీ ఎందుకు వదిలేయండి అత్తయ్య.. అక్కా ఇప్పుడు నీకు సంతోషమే కదా

స్వప్న: చాలా సంతోషంగా ఉంది కావ్య థాంక్యూ సో మచ్‌

ప్రకాష్‌: అమ్మా కావ్య ఆకలి వేస్తుందమ్మా

అనగానే అందరూ కలిసి భోజనం చేయడానికి వెళ్తారు. తర్వాత సీతారామయ్య, రాహుల్ పేరు మీద కంపెనీ పెట్టడం ఏంటని రాజ్‌, కావ్యలతో బాధపడుతుంటాడు.

సీతారామయ్య: ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదురా

రాజ్‌: ఏమైంది తాతయ్య ఇప్పుడు

సీతారామయ్య: ఇన్నేళ్లలో ఈ దుగ్గిరాల కుటుంబంలో ఏ రోజు ఎవ్వరూ చేయని పని చేశారు. ఎవ్వరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం అంటే ఇసుక ఇటుకలతో కట్టిన నాలుగు అంతస్థులు కాదురా..? నలుగురు తలదాచుకునే గూడు కాదు. మనుషులు, మమతలు, అప్యాయతలు అనుబంధాలు అన్ని కలగలుపుకుని ఎదిగిన ఒక చెట్టురా.. ఆ చెట్టు నీడలో బతికే ఎవరైనా కష్టాన్ని పంచుకోవాలి. నష్టాన్ని భరించాలి. ఇష్టాన్ని పెంచుకోవాలి స్వార్థాన్ని తుంచుకోవాలి. కానీ ఈ రోజు మీరు చేసిన పని వల్ల ఈ కుటుంబంలో మనిషైనా రాహుల్ మరో చెట్టు నీడకు వెళ్లినట్టే కదరా..? ఇప్పుడొకరు పక్కకు వెళ్లారు.. రేపు ఒకరు.. ఇలా ఒక్కోక్కరిగా వెళ్లిపోతే ఈ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది కదా

రాజ్‌: మేము ఇవాల ఇలా చేయకపోతే ఈ కుటుంబం మీరన్నట్టే విడిపోయేది తాతయ్య

కావ్య: అంతే కాదు తాతయ్య గారు ఈ ఇంటి కోడళ్లుగా నాకు అప్పుకు మీరు ఎంతో స్థానాన్ని ఇచ్చారు కానీ మా అక్కకు ఇంకా ఆ స్థాన దక్కలేదు. కారణం తను కట్టుకున్న భర్త. ఆ భర్త స్థానం పెరిగితేనే మా అక్కకు కూడా మాతో సమానమైన గౌరవం ఇస్తారని అనుకున్నాను.. ఇకపై ఈ ఇంటికి ఏ సమస్య వచ్చినా తను కూడా మాతో పాటు నిలబడుతుందని అనుకుంటున్నాను తాతయ్య

రాజ్‌: ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబం కలిసికట్టుగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము తాతయ్య

సీతారామయ్య: మీరన్నట్టు కలిసి కట్టుగా ఉండటమే నాకు సంతోషం. కానీ ఎలాంటి గొడవలు రాకుండా మీరే చూసుకోవాలి

అని చెప్పి సీతారామయ్య వెళ్లిపోతాడు. తర్వాత రుద్రాణి, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి నా కొడుకు కూడా ఒక కంపెనీకి ఓనరు అయ్యాడని బిల్డప్‌ కొడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ ఆస్థులు రాజ్‌, కళ్యాణ్‌ పంచుకున్నాక నీ కొడుకు అనాథ అయిపోతాడని ఏదో చిన్న కంపెనీ పెట్టి ఓనరును చేశారు. అది గుర్తు పెట్టుకుని మసులుకో అని చెప్తుంది. దీంతో రుద్రాణి కోపంగా రాహుల్‌ దగ్గరకు వెళ్లి తిడుతుంది. అయితే ఈ నమ్మకంతోనే స్వరాజ్‌ కంపెనీని మొత్తం హస్తగతం చేసుకుంటానని రాహుల్ చెప్పగానే రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!