Illu Illalu Pillalu Serial Today Episode : రాత్రి నుంచి ఏమీ తినని భర్తను భోజనానికి బుజ్జమ్మ పిలుస్తుంది. దీనికి రామరాజు నిరాకరిస్తాడు. ఇంట్లో ఏం సంతోషం ఉందని భోజనం చేయమంటావని ప్రశ్నిస్తాడు. నా పిల్లలు ఎవరికీ తనెంటే గౌరవం లేదనగా....బుజ్జమ్మ కల్పించుకుని పిల్లలకు మీరంటే ఎంతో ప్రేమ,గౌరవం ఉన్నాయని సముదాయిస్తుంది. దీనికి రామరాజు బదులిస్తూ....నేనంటే అంత గౌరవం ఉంటే సాగర్ నాకు తెలియకుండానే పరీక్షలు రాసి ఉద్యోగం చేయాలని భావిస్తాడా....ధీరజు తన భార్యను పోలీసు ఆఫీసరు చేయాలని నిర్ణయించుకుంటాడా అని ప్రశ్నిస్తాడు. తండ్రి అంటే వాళ్లకు ఏమాత్రం విలువలేదని...సొంతంగా నిర్ణయాలు తీసుకునేంత పెద్దోళ్లు అయిపోయారని అంటాడు. ఏదైనా అంటే కన్నతండ్రినే ఎదురించేంత ఎదిగిపోయారంటాడు.
మామయ్య వాళ్లిద్దరినీ తిడుతుంటే....పెద్ద కోడలు వల్లి తెగ మురిసిపోతుంది. ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఇదే సరైన సమయమని సంబరపడిపోతుంది. మిమ్మల్ని ఇలా ఎప్పుడూ చూడలేదని ఎడుస్తున్నట్లు నటిస్తూ ఆయన ఆవేదనను ఇంకా పెంచుతుంది. ఉద్యోగం రాసిన విషయం దాచి సాగర్, ప్రేమ తప్పు చేశారంటూ వల్లి అగ్నికి ఆజ్యం పోస్తుంది. పాత విషయాలన్నీ గుర్తు చేసి మరింత బాధపెడుతుంది. వారు తెలిసి తప్పు చేసినా మీరు పెద్ద మనసుతో క్షమించాలని వేడుకుంటుంది. భార్య రాగానే సాగర్ మారిపోయాడని లేనిపోనివి చెబుతుంది. ఇంట్లో బాధలన్నీ తొలగిపోవాలని సూచిస్తుంది. పైగా చేసిన తప్పు ఒప్పుకుని మామయ్యగారిని క్షమాపణలు అడగాలని ప్రేమ, నర్మదకు సూచిస్తుంది. వారితో బలవంతంగా మామయ్యకు క్షమాపణలు చెప్పిస్తుంది. అందరి ముందు వల్లి ఉత్తమ కోడలుగా మార్కులు కొట్టేస్తుంది.
ఇంట్లో పండుగ వాతావరణం మొదలైనా సాగర్ ఇంకా దిగాలుగా ఉండటంతో నర్మదా అతన్ని సముదాయిస్తుంది. నిన్న మీ నాన్న ముందు అలా ఎదిరించి మాట్లాడటం చూసి నేనే షాక్‌కు గురయ్యానని అంటుంది. నేను చేసిన దాంట్లో తప్పేముందని అతను ప్రశ్నిస్తాడు. నిన్ను మీ కుటుంబానికి దగ్గర చేయడానికి నాకు ఉన్న ఏకైక మార్గం...నేను ఉద్యోగం చేయడమే. దాన్ని అర్థం చేసుకోకుండా నాన్న అలా మాట్లాడేసరికి నేను తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందంటాడు. నా కోసం నువ్వు చేస్తున్న పనికి సంతోషం వేస్తున్నా....నువ్వు మీ నాన్నతో గొడవపడటం, దానికి నేను కారణం కావడం నచ్చలేదని నర్మద బాధపడుతుంది. జాబ్ విషయంలో మీ నాన్నతో ఎప్పుడూ గొడవపడొద్దని అంటుంది. పూజకు సమయం మించిపోతుంది...త్వరగా రెడీ అవ్వమని చెప్పగా...తాను ఇప్పుడు రాలేనని అంటాడు.
ఎదురింట్లో ఉన్న తిరుపతివాళ్ల ఇంట్లో పూజా ఏర్పాట్లు చేస్తుండగా...తిరుపతి బిల్డప్ ఇస్తుంటాడు. ఎవరు పిలిచినా ఇంట్లోకి రానంటూ పెద్ద వదినతో మాట్లాడుతుండగా...రామరాజు తిరుపతిని పిలిచి గొడవ ఏంటని అడుగుతాడు. దీనికి తిరుపతి బదులిస్తూ..అందరూ తనని ఇంట్లోకి రావాలని పిలుస్తున్నారని....కానీ తన పెళ్లిచేస్తే తప్ప ఇంట్లోకి రానని తెగేసి చెప్పానంటాడు. ఈ పెళ్లి జరగాలంటే ఈ రెండు కుటుంబాలు కలవాలని చెప్పగా....రామరాజు అది జరిగే పనికాదులే అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బుజ్జమ్మ కోపగించుకుని మని రెండు కుటుంబాలు ఎందుకు కలవవు అంటూ నిలదీస్తుంది. ఈ కోపతాపాలు, పగలు ప్రతీకారాలు ఎప్పుడూ ఉండవంటుంది. ఇద్దరూ పగటి కలలు కలవడం మానేయండంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పూజకు ఏర్పాట్లు చేయాలంటూ బుజ్జమ్మ, తిరుపతి కూడా వెళ్లిపోతారు.
ప్రేమ, నర్మదను మామయ్య వద్ద బాగా ఇరికించానని ఇక ఇంటి పెత్తనమంతా తనదేనంటూ శ్రీవల్లి ఆనందపడిపోతుంది. ఒంటి నిండా నగలు ధరించి పూజకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అప్పుడే తిరుపతి అక్కడి రావడంతో...నగలు చూస్తే మొత్తం వ్యవహారం తారుమారు అవుతుందని భావించి చీర కొంగు కప్పుకుంటుంది. నీ వ్యవహారం మొత్తం కనిపెట్టేశానంటూ తిరుపతి అనడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.