Honda Elevate CVT Guide: హోండా ఎలివేట్‌ CVT నడిపే చాలామందికి రెండు ప్రధాన సందేహాలు ఉంటాయి - కారు స్టార్ట్‌ చేసే సమయంలో గేర్‌ ఏ పొజిషన్‌లో ఉండాలి? & ట్రాఫిక్‌లో ఆగినప్పుడు Driveలో ఉంచాలా, Neutralలోకి మార్చాలా, లేక Park వాడాలా? ఇవి చిన్న విషయాల్లా అనిపించినప్పటికీ... మీ వాహనం సేఫ్టీ, కంఫర్ట్‌, గేర్‌బాక్స్‌ హెల్త్‌ మొత్తం ఈ అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది.

Continues below advertisement

స్టార్ట్‌ చేసే సరైన పద్ధతి

Honda Elevate CVTలో పుష్‌ ‍‌బటన్‌తో ఇంజిన్‌ ఆన్‌ చేయాలంటే వాహనాన్ని తప్పనిసరిగా ‘P’ (పార్క్‌) పొజిషన్‌లో ఉంచాలి. 

Continues below advertisement

గేర్‌ ‘P’లో ఉన్న తర్వాత బ్రేక్‌ పెడల్‌ను నొక్కి స్టార్ట్‌ బటన్‌ను నొక్కితే ఇంజిన్‌ సాఫ్ట్‌గా స్టార్ట్‌ అవుతుంది.

కొన్ని ఆటోమేటిక్‌ కార్లు ‘N’ (న్యూట్రల్‌)లో ఉన్నప్పటికీ స్టార్ట్‌ అవుతాయి. కానీ మాన్యుఫ్యాక్చర్‌ సేఫ్టీ గైడ్‌ ప్రకారం స్టార్ట్‌ చేసే సరైన పొజిషన్‌ ఎప్పుడూ ‘P’ మాత్రమే.

‘D’ ‍‌(డ్రైవ్‌)లో వాహనం స్టార్ట్‌ చేయడం అసలు సేఫ్‌ కాదు. వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలే ప్రమాదం ఉంటుంది.

ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఏ గేర్‌ వాడాలి?

ట్రాఫిక్‌ పరిస్థితి ఆధారంగా గేర్‌ వాడకం మారుతుంది. ఎక్కువ మంది Drive మోడ్‌లోనే హోల్డ్‌ చేస్తూ బ్రేక్‌ పైనే కాలు అలాగే పెట్టి కారును ఆపుతారు. ఇది తప్పు కాదు కానీ సరైనది కూడా కాదు.

తక్కువ సేపు ఆగాల్సి వస్తే (10–15 సెకన్లలోనే గ్రీన్‌ సిగ్నల్‌ పడుతుందని భావిస్తే)... కారును Drive (D)లోనే ఉంచి, గ్రీన్‌ సిగ్నల్‌ పడే వరకు బ్రేక్‌ పట్టుకుని అలాగే ఉండవచ్చు. ఇది గేర్‌ బాక్స్‌కు హాని చేయదు & ట్రాఫిక్‌ వెంటనే కదిలే అవకాశం ఉన్నప్పుడు ఇదే బెస్ట్‌ ఆప్షన్‌.

30 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువసేపు ఆగాల్సి వస్తే... సిగ్నల్‌ ఎక్కువ సేపు రెడ్‌లో ఉంటే, ట్రాఫిక్‌ జామ్‌లో కదలలేకపోతే కారును Neutral (N)లోకి మార్చడం ఉత్తమం. దీనివల్ల కారు ముందుకు జరిగే అయ్యే అవకాశమే ఉండదు, బ్రేక్‌పై ఒత్తిడి తగ్గుతుంది, గేర్‌ బాక్స్‌ వేడి పెరగదు, డ్రైవింగ్‌ స్మూత్‌గా ఉంటుంది. ప్రత్యేకంగా, CVT వాహనాల్లో Driveలో ఎక్కువ సేపు నిలబెట్టడం వల్ల చిన్నపాటి వేడి పెరుగుతుంది. ఎక్కువ వ్యవధి పాటు ఇలాగే ఉంటే గేర్‌ బాక్స్‌ మీద అనవసర ఒత్తిడి ఉంటుంది. అందుకే, హోండా ఎలివేట్‌ CVTని ట్రాఫిక్‌లో 30 సెకన్ల కంటే ఎక్కువ ఆపాల్సి వస్తే తప్పకుండా Neutralలో ఉంచడం మంచిది.

Park (P) ఎప్పుడు వాడాలి?

Park‌ను ట్రాఫిక్‌లో వాడకూడదు.

వాహనం పూర్తిగా నిలిచిపోయి పార్క్‌ చేసినప్పుడు మాత్రమే ‘P’ గేర్‌ను వాడాలి.

ట్రాఫిక్‌ సిగ్నల్‌లో ‘P’లోకి మార్చడం అసలు అవసరమే కాదు, సేఫ్‌ కూడా కాదు.

ఇప్పుడు చెప్పినవన్నీ సులభంగా గుర్తు పెట్టుకోవడానికి రీక్యాప్‌

కారును స్టార్ట్‌ చేయాలంటే - P

కాసేపు ట్రాఫిక్‌ హోల్డ్‌ అయితే - D

ఎక్కువసేపు ట్రాఫిక్‌లో ఆగాల్సి వస్తే - N

పూర్తిగా పార్క్‌ చేసినప్పుడు - P

Honda Elevate CVTను ఇలా వాడితే వాహనం లైఫ్‌ కూడా పెరుగుతుంది, డ్రైవింగ్‌ అనుభవం కూడా మరింత స్మూత్‌గా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.