Andhra Truedown:  ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో మొదటిసారిగా విద్యుత్ చార్జీలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంఘం  'ట్రూ డౌన్' మెకానిజం ప్రకారం యూనిట్‌కు 13 పైసలు చార్జీలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకే ఇది రాష్ట్రంలోని 2.5 కోట్లకు పైగా విద్యుత్ వినియోగదారులకు మొత్తం రూ924 కోట్ల రీఫండ్‌గా  ఇస్తున్నారు. ఈ నెల బిల్లుల్లో ఈ ట్రూడౌన్ అమలు ప్రారంభమయింది. పలువురు నెటిజన్లు తమకు బిల్లులు తగ్గాయని సోషల్ మీడియాలో  పోస్టు చేస్తున్నారు. 
 
ఈ 'ట్రూ డౌన్' నిర్ణయం ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ (ఎఫ్‌పీపీసీఏ) ట్రూ-అప్‌పై ఆధారపడి ఉంది. మొదట డిస్కామ్‌లు రూ. 2,758.  కోట్లు అడ్జస్ట్‌మెంట్ కోరినా, ఏపీఈఆర్సీ రూ. 1,863  కోట్లకు మాత్రమే ఆమోదం ఇచ్చింది. మిగిలిన  రూ.924 కోట్లు  వినియోగదారులకు తిరిగి ఇవ్వాలని ఆదేశించారు.   విద్యుత్ రంగంలో 'ట్రూ-అప్' అనేది ఏడాది చివరిలో డిస్కామ్‌ల ఖర్చులు, ఆదాయాలను పరిశీలించి, అధిక చార్జీలు వసూలైతే తిరిగి ఇచ్చే ప్రక్రియ. 'ట్రూ డౌన్' అంటే ఇందులో చార్జీలు తగ్గించే భాగం. ఏపీఈఆర్సీ సెప్టెంబర్ 28న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌పీపీసీఏ ట్రూ-అప్‌లో రూ.895 కోట్లు తగ్గించారు. ఇది యూనిట్‌కు 13 పైసలు తగ్గుతుంది.                              

Continues below advertisement



గృహ వినియోగదారులు (డొమెస్టిక్), వాణిజ్య, పరిశ్రమలు అందరూ ప్రయోజనం పొందుతారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 30న ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసి, "ట్రూ డౌన్ మెకానిజంతో యూనిట్‌కు 13 పైసలు చార్జీలు తగ్గడం చారిత్రకం. నవంబర్ నుంచి మంసుల్లో ప్రతిఫలిస్తుంది" అని ప్రకటించారు.           





ఏపీలో  2.5 కోట్ల గృహ వినియోగదారులు, 2 లక్షలకు పైగా వాణిజ్య సంస్థలు, 50 వేల పరిశ్రమలు ఉన్నాయి.  మొత్తం ₹924 కోట్ల రీఫండ్‌ను 12 నెలల్లో విభజించి ఇస్తారు. డిస్కామ్‌లు  ఈ మొత్తాన్ని  బిల్లుల్లో అడ్జస్ట్ చేస్తున్నాయి.