ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు గత నెల రోజులుగా దాదాపుగా స్థిరంగా నమోదవుతున్నాయి. నిత్యం వెయ్యికి పైగా మంది కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. కొవిడ్ మరణాలు సైతం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,190 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 11 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,27,090 పాజిటివ్ కేసులకు గాను 19,97,982 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,110 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
ఏపీలో సెప్టెంబర్ 12 ఉదయం వరకు 13,998 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. మరోవైపు యాక్టివ్ కేసులు నిన్నటితో పోల్చితే పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,190 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. తాజా పాటిజివ్ కేసులతో పోల్చితే కోలుకున్న వారే అధికంగా ఉన్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు
చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు..
కొవిడ్19 బారిన పడి తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 73 లక్షల 24 వేల 895 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని బులెటిన్‌తో తెలిపారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 219 మంది కరోనా బారిన పడగా.. ఆ తరువాత కృష్ణా జిల్లాలో 164, ప్రకాశంలో 121 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10, విజయనగరం జిల్లాలో 22 మంది కరోనా బారిన పడ్డారు.
Also Read: హార్ట్ ఎటాక్ vs కార్డియాక్ అరెస్ట్: గుండె జబ్బులు లేకపోయిన హృదయం ఆగుతుంది.. ఎందుకో తెలుసా?