Coronavirus Cases In AP: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు తాజాగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 44 వేల పైగా శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 523 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,58,915కు చేరుకుంది. తాజాగా కోవిడ్19తో పోరాడుతూ ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో 14,320 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 






ఈ జిల్లాల్లో కరోనా తీవ్ర ప్రభావం..
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87 మంది కరోనా బారిన పడ్డారు. గుంటూరులో 78, కృష్ణాలో 61, నెల్లూరులో 46, విశాఖపట్నంలో 43 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అత్యల్పంగా కర్నూలులో ఇద్దరు కరోనా బారిన పడగా.. శ్రీకాకుళంలో 15, ప్రకాశంలో 16, అనంతపురంలో 21 మందికి తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కోవిడ్19తో పోరాడుతూ ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు చనిపోయారు.


Also Read: చేతకాని దద్దమ్మలే తిడతారు.. తిడితే ఇక ముందు అదే రియాక్షన్ వస్తుందని సజ్జల హెచ్చరిక ! 


రికవరీ కేసులే అధికం..
ఏపీలో నిన్న ఒక్కరోజులో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులే అధికంగా ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 20 లక్షల 58 వేల 915 మంది కరోనా బారిన పడగా, అందులో 20,39,029 మంది కొవిడ్19 నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు క్రమేపీ మెరుగవుతోంది. మంగళవారం నాడు 608 మంది కరోనా నుంచి ఆరోగ్యంగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,566 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,91,00,342 (2 కోట్ల 91 లక్షల 342) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... నిన్న ఒక్కరోజులో 44,086 శాంపిల్స్‌ టెస్ట్ చేసినట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది.


Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి