Congress party has issued notices to Yatra 2 director Mahi V Raghav :  యాత్ర 2 దర్శక నిర్మాత మహి వి రాఘవకు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయి.  యాత్ర -2 సినిమాల్లో అన్ని అభూత ,అసత్యకథనాలు సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసం చిత్ర దర్శకనిర్మాతలు సృష్టించి రాష్ట్ర ప్రజలకు తప్పు దోవపట్టిస్తున్నారని విజయవాడ సిటికాంగ్రేస్ కమిటీ నేతలు లీగల్ నోటీసు జారీ చేశారు.  యాత్ర -2సినిమా కథ జగన్ మోహన్ రెడ్డి కల్పిత కథ చిత్రాన్ని తెరకెక్కించి ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారని నేతలు మండిపడ్డారు.  సినిమా   సోనియా గాంధీజి పై కల్పిత సన్నివేశాలను వెంటనే తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.                            


 సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని అభూతకల్పితాలు అసత్యాలు ప్రచారం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని..కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.    ఈ విధంగా నే వ్యూహంలో అసత్యాలు ,కల్పితాలు సృష్టించి  సోనియాగాంధీని విలన్ గా చూపేందుకు జగన్ మోహన్ రెడ్డి పన్నాగం ప్నారని ఆరోపించారు.   యాత్ర -2 ఫై గవర్నర్ కు ఫిర్యాదుచేస్తాము అని పేర్కొన్నారు , వై .ఎస్ .ఆర్ .వ్యతిరేకించే భావాల పునాదులమీద పుట్టిన పార్టీ వైసీపీ   సోనియా కించపర్చడం సరి కాదన్నారు.   ఇందిరమ్మ కుటుంబాన్ని ఏ ఒక్కరోజు వై .ఎస్ రాజశేఖర్ రెడ్డి విమర్శించలేదని  పార్టీ నేతలు గుర్తు చేశారు.  వైఎస్  రాహుల్  ని దేశప్రధానిని చేయాలనే దృఢమైన సంకల్పంతో పనిచేసశారని గుర్తు చేశారు.                                                        


కాంగ్రెస్ అధికారంలో వున్నా ప్రధాని పదవిని సైతం త్యజించిన శ్రీమతి సోనియాజీ గురించి ,దేశం కోసం సర్వసం ప్రాణాలను సైతం త్యజించిన కుటుంబం మీద మీకు అంత ద్వేషం ఎందుకు అని వైఎస్ జగన్ ను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.  పీసీసీ అధినేత్రి షర్మిలను సైతం  వైసీపీ వదలటం లేదు ...వారు అధికార దాహంతో చెల్లిని ,రాజకీయంగా  అండగా నిలబడిన ఇందిరమ్మ కుటుంబాన్ని సైతం టార్గెట్ చేయటం సరైనా విధానం కాదన్నారు.  మర్శిస్తూ యాత్ర -2 లో శ్రీమతి సోనియాజీ పై అసత్య కథనాలను తొలగించాలని సెన్సార్ బోర్డు కుఫిర్యాదుచేశారు ..దర్శకనిర్మాతలకు హైకోర్టు న్యాయవాది బైపూడి నాగేశ్వరావు ద్వారా నోటీసు లు పంపామన్నారు.                                                   


సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసం ...రాంగోపాల్ వర్మ ..వ్యూహం .... మహి వి రాఘవ్ యాత్ర -2 ను సృష్టించారు ...రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం .... ప్రతేక హోదా ,పోలవరం ,నిరుద్యోగ సమస్య ,రోడ్లు ,ప్రాజెక్టులు కోసం,దళితులు మీద జరుగుతున్నా ఘోరాలు ,రైతులమీద జరుగుతున్నా కుట్రలు .... మీద మతత్వం మీద మంచి మెసేజ్ సినిమాలు తీస్తే మిమల్ని భావితరాలు గుర్తుచేసుకుంటారని సలహా ఇచ్చారు.