CM Delhi Tour : ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ కీలక సమావేశానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధాని మోడీ, హోం శాఖా మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎంవో వర్గాలు పీఎంవోకు సమాచారం అందిచినట్లు ;తెలుస్తోంది. అదే క్రమంలో అమిత్ షా అపాయింట్‌మెంట్‌కు కూడా సీఎంవో వర్గాలు ఆయన పేషీకి సమాచారం అందించారు. ఈనెల 27వ తేదీన నీతి ఆయోగ్ బృందం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో సమావేశం కానుంది.
ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేదా ఆర్థికశాఖ మంత్రులు పాల్గొనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ఈనెల 26వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అదే రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకునే అవకాశం ఉంది. మరుసటి రోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు.ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అలాగే విభజన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్ట్, నిధులు విధుల విభజన, ప్రత్యేక హోదా గురించి మాట్లాడనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 సంస్థల ఏర్పాటు, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల విభజన అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది.
గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చిన ఈసీ- జనసేన నుంచి జారిపోయినట్టేనా!`
అదే రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోదీ అపాయింట్‌మెంట్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ ముగిసిన తరువాత సీఎం జగన్ ప్రధానితో భేటీ అయ్యేలా అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మోదీ, అమిత్ షాలతో రాజకీయ చర్చలు కూడా జరిపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి తాము ఎప్పుడూ వ్యతిరేకంగా లేమని అందుకే ఏపీలో తమకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో చేరవద్దని విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల తర్వాత కూడా తమ మద్దతు పూర్తిగా బీజేపీకే ఉంటుందనే హామీ జగన్ ఇస్తారని అంటన్నారు.
ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాష్- వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చేలా ప్రయత్నాలు
మరో వైపు వైసీపీ విముక్త ఏపీ కోసం.. తాము కృషి చేస్తామని బీజేపీ నేతలు కూడా కలిసి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిస్తున్నారు. పవన్ ప్రతిపాదనను హైకమాండ్ వద్ద పెట్టామని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు కీలకం కాబోతున్న తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.