ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ ( CM Jagan ) నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ( AP Cabinet ) సమావేశంలోనే సహచరులకు సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కొంత మంది మంత్రులు.. ఇదే తమకు చివరి కేబినెట్ సమావేశమా అని ముఖ్యమంత్రి జగన్‌నే సరదాగా ప్రశ్నించారు. దీంతో సీఎం జగన్ తన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని వివరించినట్లుగా తెలుస్తోంది. చాలా మంది మంత్రి పదవుల ఆశావహులు ఉన్నారని... వారికి న్యాయం చేయాల్సి ఉందన్నారు. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన డిమోషన్‌గా భావించవద్దని మంత్రులకు సూచించారు. కొంత మంది మంత్రులను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమిస్తామన్నారు. పార్టీ కోసం ప్రస్తుతం ఉన్న మంత్రులు పని చేయాలని..పార్టీని గెలిపించుకుని వస్తే మళ్లీ మీరే మంత్రులు కావొచ్చునని జగన్ వారితో వ్యాఖ్యానించారు. 







కేసీఆర్‌ ఆ రెండూ కంట్రోల్ చేసుకోవాల్సిందే, ఎడమచేయి లాగడానికి కారణం ఇదీ - యశోద డాక్టర్స్ వెల్లడి


గతంలోనూ ఓ మంత్రివర్గ సమావేశంలో వంద శాతం మంత్రుల్ని మార్చేస్తారని సీఎం జగన్ చెప్పారని..దానికి తాము అంగీకరించామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( Miniser Balineni ) ప్రకటించారు. నిజానికి సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే... మంత్రులకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. పదవీ కాలం ఐదేళ్లు అనుకోవద్దని..రెండున్నరేళ్ల తర్వాత 80 శాతం మంది మంత్రుల్ని మార్చేస్తానని చెప్పారు. అందుకే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న చాలా మంది సీనియర్లు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రెండున్నరేళ్లు ముగిసే సరికి వివిధ కారణాలతో మంత్రివర్గ ప్రక్షాళన చేయలేకపోయారు. ఇప్పుడు ఏప్రిల్‌లో ఉగాదికి చేయాలని ముహుర్తం నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. 


2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి


ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం అన్న క్లారిటీ ఇవ్వడంతో మంత్రులు కూడా మానసికంగా సిద్ధమవుతున్నారు. కొత్త మంత్రులపై ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే అందరు మంత్రుల్ని తొలగిస్తారా లేకపోతే.. కొంత మంది విధేయుల్ని కొనసాగిస్తారా అన్నదానిపై వైఎస్ఆర్‌సీపీలో స్పష్టత లేదు. బాగా విధేయత చూపిస్తూ.. విపక్షాలపై విరుచుకుపడుతున్న వారిని కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ప్రస్తుత మంత్రివర్గంలో కొందరు మాత్రమే ఉంటారని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మంత్రి పదవులు లేని వారు ఎదురు చూస్తున్న కాలం వచ్చేసిందని వైఎస్ఆర్‌సీపీలో ఉత్సాహం కనిపిస్తోంది.