పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంపై.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నిజానికి ప్రతి జిల్లాకు ఓ ఎయిర్ పోర్టు ఉండాలనేది మంచి ఆలోచన అని సీఎం జగన్ అన్నారు. వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండేలా చూసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే రీతిలో.. విమానాశ్రయాల నిర్మాణం ఉండాలన్నారు. ఎయిర్ పోర్టుల నిర్మాణానికి.. అనుగుణంగా... మౌలిక సదుపాయాల కల్పనపై.. దృష్టి పెట్టాలన్నారు
'బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా చూడాలి. దానికోసం రన్ వే డెవలప్ చేయాలి. మన రాష్ట్రంలో 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలి. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలి. పనులను వేగవంతం చేయాలి.' అని సీఎం జగన్ అన్నారు.
విమానాశ్రయాల విస్తరణపైనా.. దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని సీఎం అన్నారు.
9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని జగన్ అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు అతిత్వరలో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు.
Also Read: Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం
Also Read: Chittoor: భర్తను చంపి తలను సంచిలో పెట్టుకున్న భార్య.. వెంటనే ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లిందంటే..!