CM Jagan Released Jagananna Thodu Funds: 'జగనన్న తోడు' పథకం దేశానికే ఆదర్శమని.. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుందని సీఎం జగన్ (CM Jagan) చెప్పారు. తాడేపల్లిలోని (Tadepalli) క్యాంపు కార్యాలయంలో గురువారం ఎనిమిదో విడత 'జగనన్న తోడు' (Jagananna Thodu) పథకం కింద నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. 3.95 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, అంతకుపైన కలిపి రూ.417.94 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తోంది. మొత్తంగా రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నామని, రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 16,73,580 చిరువ్యాపారులకు వడ్డీ చెల్లించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 87.13 శాతం అక్కచెల్లెమ్మలు లబ్ధి పొందారని, ఇది మహిళా సాధికారతలో మరో విప్లవమని పేర్కొన్నారు. 'దేశానికే ఈ కార్యక్రమం దిక్సూచిగా నిలిచింది. దేశం మొత్తం మీద పీఎం స్వనిధి పథకం కింద 58.63 లక్షల మందికి రుణాలు ఇస్తే.. రాష్ట్రంలోనే 16.74 లక్షల మంది ఉన్నారు. కేంద్రం రూ.10,220 కోట్లు ఇస్తే మన రాష్ట్రంలో రూ.3,337 కోట్లు ఇచ్చాం.' అని సీఎం పేర్కొన్నారు.
వాటితోనే సాధ్యం
అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్రం ఇచ్చే 7 శాతం రుణాలు ఇస్తుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే వడ్డీ రూపంలో రూ.88 కోట్లు చెల్లించినట్లు జగన్ తెలిపారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని ఉద్ఘాటించారు. పారదర్శకంగా రుణాలు ఇప్పించగలుగుతున్నామని, అదే విధంగా వాళ్లు రుణాలు చెల్లించేలా ఈ వ్యవస్థ ఉపయోగపడిందని అన్నారు. రుణాల రికవరీ 90 శాతం పైగానే ఉందని తెలిపారు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. ఇంకా ప్రజలకు మంచి చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.
'జగనన్న తోడు' అంటే.?
రాష్ట్రంలో నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద నిలదొక్కుకునేలా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణాన్ని సున్నా వడ్డీకే ఇస్తుంది. రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో రూ.1000 చొప్పున జోడిస్తూ రూ.13 వేల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నారు. 8వ విడతగా రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటి వరకూ వడ్డీ లేని రుణాలు రూ.3,373.73 కోట్లు అందించారు. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, టిఫిన్స్ అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించే వారు, సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వ్యాపారాలు చేసుకునే వారు, చేనేత, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు.
Also Read: Vijayawada News: కేశినేని నానికి చిన్ని స్ట్రాంగ్ కౌంటర్- కుటుంబ కలహాలపై క్లారిటీ