CM Jagan X Post: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈనాటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయిందని జగన్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల కాలంలో తాను చేసిన మంచి గురించి జగన్ ప్రస్తావించారు. 2019లో సరిగ్గా ఇదే రోజున (మే 30) తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని సీఎం గుర్తు చేసుకున్నారు.
ఈ ఐదేళ్ల కాలంలో దేవుడి దయ, అప్పుడు ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో ఈ ఐదేళ్లు ప్రభుత్వం మంచి చేసిందని జగన్ అన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు అనేవి చూడకుండా ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం మంచి చేసిందని జగన్ అన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకాబోతోందని.. మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తుందని జగన్ అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘‘దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది’’ అని ఏపీ సీఎం జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.