AP NEws : ఏపీలో VRA లకు గతంలో 500 డీఏ మంజూరు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫైల్ పై సంతకం పెట్టినట్లుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో డీఏ 300 రూపాయలు DA ఇచ్చేవారు. గత ప్రభుత్వం ఈ DA ను రద్దు చేసిందన్నారు. VRA లకు DA ను పునరిద్దరించవలసిందిగా ముఖ్యమంత్రి ని కలిసి కోరడం జరిగిందని.. . అందుకు ముఖ్యమంత్రి గారిని వెంటనే స్పందించి DA తిరిగి మంజూరు చేసేలా ఫైల్ సర్కులేట్ చేయమని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఫైల్ లో DA ను 300 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
వీఆర్ఏలకు డీఏ నిలిపివేశారన్న ఆరోపణలపై గతంలో వివరణ ఇచ్చిన ప్రభుత్వం
‘‘గత ప్రభుత్వంలో ఆర్థిక విభాగం నుంచి 29.01.2019 న GO. MS. No.14 ద్వారా వీఆర్ఏల తాత్కాలిక కరవు భత్యాన్ని నెలకు రూ .300/- చొప్పున 01.01.2018 నుండి 01.06.2018 వరకు (కేవలం 5 నెలలకు) మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే 01.06.2018 నుండి వీఆర్ఏలకు డీఏ వర్తించదు అనే ఉత్తర్వులను గత ప్రభుత్వమే ఇచ్చింది.
తదనుగుణంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు (Director, Treasury &Accounts - DTA) ఒక మెమో ద్వారా 5 నెలల కంటే ఎక్కువగా (GO. MS. No.14 ను అనుగుణంగా) డీఏ డ్రా చేసిన వీఆర్ఏల సమాచారాన్ని సేకరించమని DTA లకు తెలియజేశారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.
తదుపరి అమరావతి జేఏసీతో పాటు ఇతర రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వానికి అభ్యర్థన పత్రాలను ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన GO. MS. No.14 ద్వారా వీఆర్ఏల కరువు భత్యానికి సంబంధించి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది మళ్లీ వీఆర్ఏల కరవు భత్యాన్ని పునరుద్దరించాలని కోరారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించడం, పరిష్కరించడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో రెగ్యులర్ గా సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సమావేశాలలో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఎజెండాలో భాగంగా వీఆర్ఏల కరువు భత్యానికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ల
ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించడం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన GSWS ఉద్యోగ నియామకాలలో కూడా అర్హత కలిగిన సుమారు 2,880 మంది నామినీ VAO లను, వీఆర్ఏ లను కూడా గ్రేడ్-2 VRO లుగా నియమించడం జరిగింది.
ఇటీవల 2023వ సంవత్సరంలో కూడా అర్హత కలిగిన 66 మంది వీఆర్ఏ లను VRO గ్రేడ్ -2 లుగా పదోన్నతి కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం వీఆర్ఏ లకు సంబంధించి అనేక ఉపయోగకర నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కేవలం ఉద్యోగుల్లో భయాందోళన కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రతికూల వార్తలను ప్రముఖ పత్రిక ఈ రోజు ప్రచురించిందని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం సుమారు 19,359 మంది వీఆర్ఏలు మన రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. Director ,Treasury &Accounts వారు మెమో ఇచ్చినప్పటికీ ఏ ఒక్క వీఆర్ఏ నుండి కూడా అదనంగా డ్రా చేసిన DA ను రికవరీ చేయలేదు.
రెవెన్యూ విభాగం వారు వీఆర్ఏల నుండి DAకు సంబంధించి ఎటువంటి రికవరీ లేకుండా చేయడంతో పాటు, ప్రతి వీఆర్ఏ కు నెలకు రూ .300/- చొప్పున కరువు భత్యం (DA) కొనసాగించేలా తగిన ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ ప్రతిపాదనలపై అతి త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశ్యంతో ఈరోజు పత్రికలో వీఆర్ఏల నుండి ప్రభుత్వం DA రికవరీ చేస్తుందని ప్రతికూల వార్తలను రాశారు. ఆ పత్రికలో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం’’ అని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.