Jagan Said that Chandrababu having too many star campaigners : ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధులకు బటన్ నొక్కే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై పరోక్ష విమర్శలు చేశారు. ఆమె చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ మారారని విమర్శలు గుప్పించారు. ఏపీలో చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. వారిలో బీజేపీలో కొంత మంది ఉన్నారని..పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినరేన్నారు. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం చేరారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరింది ఆయన సోదరి షర్మిలనే కాబట్టి.. షర్మిలను ఉద్దేశఇంచి చేసినవేనని స్పష్టమవుతోంది.
పసుపు కమలాల మనుషులు బాబుకు స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారు. ఇంకా స్టార్ క్యాంపెయినర్‌లు చాలామందే ఉన్నారు. అమరావతిలో బాబు బినామీలు ఉన్నట్లే.. ఇతర పార్టీల్లో చంద్రబాబు బినామీలు స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారు. కొందరు టీవీల్లో విశ్లేషకులు, మేధావుల పేరిట టీవీల్లో కూడా కనిపిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికి గజ దొంగల ముఠా ఉంది. ఆయనకు మంచి చేసిన ఘనతే లేదు. పాలనతో మోసం చేసిన ఘనతే ఉందని విమర్శించారు. ఏం చేయని ఆయనకు ఇంత మంది స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారు. బాబును భుజాన మోసే ముఠా చాలామందే ఉన్నారు. జెండాలు జత కట్టిన వాళ్లంతా అనుకుంటున్నారని మండిపడ్డారు. తనకు అలాంటి వారు ఎవరూ లేరన్నారు.
పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేశాడు. అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన ఆ మాట గాలి కొదిలేశాడు. అక్టోబర్ 2016 నుంచి ఆ అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశాడు. అప్పట్లో.. పొదుపు సంఘాల రుణాలు కాస్త.. తడిసి మొపెడు అయ్యి వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితికి వచ్చింది. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు ఒక్క మోసంతో చంద్రబాబు నాయుడిగారి ఆటతో నష్టం జరిగిందని.. దెబ్బ పడింది అనడానికి ఇదే ఉదాహరణ. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు.
గతంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి దాకా లంచాలిస్తేనే పనులు జరిగేవని.. ఇప్పుడు పాదర్శకంగా సంక్షేమం అర్హులకు అందుతోందని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కూడా ఓ పాలన ఉండేది. అప్పుడు కూడా ఒకే రాష్ట్రం.. ఇదే రాష్ట్రం. ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రే. మిగిలినవి మామూలే. అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మీ బిడ్డ ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మమ ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. గతంలో దోచుకో పంచుకో తినుకో ఉండేది. ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా మీ ఖాతాల్లోనే డబ్బు జమ అవుతోంది. తేడా గమనించమని కోరుతున్నానన్నారు.