Mahesh Babu Germany tour: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా జర్మనీ టూర్ కు వెళ్లారు. ఈ పర్యటపై రకరకాల వార్తలు వినిపించాయి. రాజమౌళితో చేయబోతున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం వెళ్లారనే టాక్ వినిపించింది. ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ ప్రిస్స్ అక్కడికి వెళ్లాడనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, రాజమౌళితో కాకుండా, ఆయన ఒక్కడే జర్మనీకి వెళ్లడం పట్ల, ఈ వార్తలు నిజం కాదని పలువురు భావించారు. అయితే, వారి అనుమానం నిజమేనని తాజాగా వెల్లడి అయ్యింది. మహేష్ బాబు జర్మనీ టూర్ వెనుక అసలు కథ వేరే ఉందని వెల్లడైంది.  జర్మనీలో డాక్టర్ హ్యారీ కొనిగ్ అనే స్పా కన్సల్టెంట్ ను కలిసేందుకు వెళ్లారు.  


మహేష్ జర్మనీకి ఎందుకు వెళ్లారంటే?


నిజానికి మహేష్ బాబు గత కొంత కాలంగా ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లో బాగా బిజీగా గడిపారు. రెస్టు లేకుండా డ్యాన్సులు, పాటల షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బాడీ ఫిట్ నెస్ కు సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు, సలహాల కోసం హ్యారీని కలుసుకున్నారట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా మహేష్ హ్యారీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఫిట్ నెస్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయనతో చర్చించారట. రాజమౌళితో కీలక ప్రాజెక్టు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి డైట్ ఫాలో కావాలో అడిగి తెలుసుకున్నారట. హ్యారీ కొనిగ్ విలువైన సూచనలు బాడీ ఫిట్ నెస్ కోసం చాలా ఉపయోగపడతాయని మహేష్ బాబు ఆశిస్తున్నారు.






ఫారెస్ట్ బ్యాక్ డ్రౌప్ లో తెరకెక్కుతున్న SSMB29


ఇక రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రౌప్ లో ‘ఇండియానా జోన్స్’ తరహాలో తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళితో పాటు కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ధృవీకరించారు. అయితే, ఈ సినిమాలో నటీనటులకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. సినిమా షూటింగ్ ప్రారంభం రోజునే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.


‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు


మహేష్ బాబు తాజాగా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ విడుదలైనా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదు అనిపించింది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్య కృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించగా, తమన్ సంగీతం అందించారు.


Read Also: మా నాన్న ఏడుస్తున్నట్లు నటిస్తున్నాడు, అమీర్ ఖాన్ పై కూతురు ఐరా కామెంట్స్