Chittoor News : తిరుమలలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఏనుగుల గుంపు తరచు రోడ్లపైకి వస్తూ భక్తులను భయాందోళనలకు గురిచేస్తుంది.  కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి శేషాచలం అటవీ ప్రాంతంవైపు  ఏనుగుల గుంపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాపనివాశనం వెళ్లాలంటే భక్తులు భయపడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఏనుగుల గుంపు రోడ్లపైకి వచ్చాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం రోడ్డులో తిష్ఠ వేసిన ఏనుగులు ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి. ఆ మార్గంలో  బైక్ పై వస్తున్న వారిని ఏనుగులు దాడికి యత్నించాయి. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ రహదారిలో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగులను అడవిలోకి పంపేందుకు టీటీడీ, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.


ఏనుగు దాడిలో రైతు మృతి


చిత్తూరు జిల్లాలో సదుం మండలం జోగివారి పల్లి గ్రామ పరిధిలోని గొల్లపల్లికి చెందిన ఎల్లప్ప(38) గురువారం తెల్లవారుజామున రాత్రి పొలం వద్ద ఉండగా ఏనుగు అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు రైతును వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రైతు ఎల్లప్ప మృతి చెందాడు.


Also Read : Chittoor: RRR చూసి ఇంటికి బయల్దేరిన యువకుడు, రెండ్రోజులైనా రాలేదు - కూపీ లాగితే సంచలన విషయాలు, అవాక్కైన పోలీసులు!


చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య 


చిత్తూరు జిల్లా జోగివారిపల్లె అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పంట పొలాలపై ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి. జోగివారిపల్లె పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ఎల్లప్ప(38) తోట వద్ద నిద్రపోతున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఎల్లప్ప తలకు తీవ్ర గాయమైంది. అతడిని చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఎల్లప్పు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. జోగివారిపల్లె సంఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య ఇటీవల ఎక్కువైంది. కొన్ని రోజులుగా మామిడి తోటలను ధ్వంసం చేయడంతో పాటు పొలాల్లోని మోటార్లను నాశనం చేస్తున్నాయి. 


Also Read : AP High Court : ఏపీ హైకోర్టు సంచలన తీర్పు, 8 మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష