ఆంధ్రప్రదేశ్‌లో నెలంతా ఉద్యోగం చేసిన వ్యక్తికి ఒకటో తేదీన జీతం వస్తుందో లేదోనన్న టెన్షన్ సహజమే. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉండటంతో ఆలస్యంగా జీతాలిస్తోంది. అలాంటిది అసలు ఉద్యోగం చేయకుండా.. కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్న వ్యక్తికి జీతం వస్తుందా? అదెలా సాధ్యమని అనుకోకుండి. సాధ్యమే. వచ్చింది..అదీ కూడా ఠంచన్‌గా అందరికీ వచ్చినట్లుగానే వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్వాపరాలు ఇవి. 


పదో తరగతి చదివి ఐపీఎస్ అధికారి అయిపోయాడు - రిసార్ట్ లో సూట్ రూం బుక్ చేసి బుక్కాయ్యాడు


పశ్చిమగోదావరి జిల్లా చింతూరు మండలం లోని సరివెల సబ్ స్టేషన్ లో  అవినీతి జరిగిందని అధికారులు తేల్చారు. ఈ అవినీతి కేసులో సబ్ స్టేషన్ ఆపరేటర్‌ మహేష్‌ను  గత నెల 8వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నారు. కానీ మహేష్ కు జీతం వచ్చింది.   సరివెల సబ్ స్టేషన్ ఆపరేటర్ మహేష్ ఉద్యోగం చేస్తున్నట్లుగా సంబంధిత రికార్డ్ లు సమర్పించి ఫిబ్రవరి నెల జీతం విడుదల చేశారు.మార్చి నెల 3వ తేదీన జీతం చేసినట్లుగా రికార్డు లు వెలుగులోకి వచ్చాయి. దీంతో సీపీఎం నేతలు ఆ సబ్ స్టేషన్‌లో అవినీతి అందరూ అనుకున్నంతలో లేదని.. ఎవరూ ఊహించనంత ఉందని చెబుతూ..విచారణకు డిమాండ్ చేస్తున్నారు. 


కువైట్‌లో వెంకటేష్ ఆత్మహత్య - ఈయన క్రైమ్ స్టోరీ ధ్రిల్లరే.. !


మహేష్‌కు జీతం ఎలా వచ్చిందని సీపీఎం నేతలు  ఎ ఈని ప్రశ్నిస్తే  18వ తేదీన సాలరీ సర్టిఫికెట్ సమర్పించామని పొంతలేని సమాధానాలు చెప్పారు. మహేష్ రెగ్యులర్ ఉద్యోగి కాదు రోజువారీ కార్మికుడిగా ఉన్న కాంట్రాక్టర్ ఉద్యోగం 25వ తారీకు తర్వాత శాలరీ అటెండెన్స్ సమర్పించాల్సి ఉంటుంది.   దానికి విరుద్ధంగా 18వ తేదీనే సర్టిఫికెట్ అటెండెన్స్ సమర్పించినట్లుగా ఎ ఈ చెప్పడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.  జైల్లో ఉన్న  మహేష్ కు శాలరీ విడుదల చేయడం వెనుక పెద్ద అవినీతి ఉందని.. విచారణ చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 


అయితే విద్యుత్ ఉద్యోగులు అవినీతికి అలవాటు పడిపోయి.. తప్పుడు స్టేట్‌మెంట్ సర్పించి జీతం డ్రా చేసుకున్నారని..మహేష్‌కు ఇవ్వకుండానే తమ ఖాతాలో వేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్న మహేష్‌ జీతం తీసుకునే చాన్స్ లేదు. పర్మినెంట్ ఉద్యోగి కాబట్టి బ్యాంకులో జమ చేయరు.కానీ ఆయన పేరు మీద జీతం డ్రా చేసారు. అంటే .. మద్యలో ఎవరు ఎత్తేశారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.