అమరావతిపై హైకోర్టు తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు ( Charndra babu ) స్వాగతించారు. 807 రోజులుగా రైతులు, మహిళలు ఆందోళన చేశారని ధర్మం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని అమరావతి ( Amaravati ) విషయంలో అదే జరిగిందని వ్యాఖ్యానించారు.  రాజధాని అమరావతిపై కుట్రలు చేశారని, అమరావతిని శ్మశానం అన్నారని తెలిపారు. రాజధాని రైతులు పవిత్రమైన పాదయాత్ర ( Padayatra ) చేశారని ప్రశంసించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు పోరాటం ఆపలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విజయం ప్రజా రాజధానిది, 5 కోట్ల ఆంధ్రులదని చెప్పారు. అమరావతి అభివృద్ధి చెందితే విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు కాదని చంద్రబాబు అన్నారు.


మూడు రాజధానులకు ఇప్పటికీ ఓ మార్గం ! జగన్ ప్లాన్ బీ అమలు చేస్తారా ?


రాజధాని విషయంలో తప్పుడు నిర్ణయాలతో సీఎం జగన్ ( Jagan ) చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. రాజధానిపై ప్రభుత్వమే కుట్రలు చేసిందని  మండిపడ్డారు. అమరావతిని శ్మశానం అన్నారు.. మునిగి పోతుందని ప్రచారం చేశారన్నారు. ఏపీకి సంపద సృష్టించే ఆదాయ వనరు అమరావతి అని.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. సీఎం  జగన్ రెడ్డి మాటలు చేష్టలు చూసి మనిషో, పశువో  అర్థం కాక తనకే ఆశ్చర్యం వేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎస్సీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా (AP Capital ) ఎంచుకుంటే జగన్ రెడ్డికి కులం అడ్డొచ్చిందని విమర్శించారు. 


ఏపీ రాజధాని కేసులో జగన్ ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదా? రిట్ ఆఫ్ మాండమాస్ అంటే ఏంటి?


అమరావతి అభివృద్ధి చేస్తే ఓ ప్రాంతం అభివృద్ది అవుతుందని ప్రచారం చేశారని అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. అమరావతిని నిర్ణయించినప్పుడు అందరూ స్వాగతించారని.. సీఎం జగన్ కూడా స్వాగతించారని ఆ రోజు అడ్డు రాని కులమతాలు ఈ రోజు ఎలా అడ్డు వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. అర్థం లేని విధానాలతో మూడు ముక్కలాటకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. లాఠీ దెబ్బలు, కేసులను ఎదురొడ్డి రైతులు పోరాటం చేశారు. తిరుపతి వరకూ మహాపాదయాత్ర కూడా నిర్వహించారు. చివరికి కోర్టులో రైతులకు అనుకూల ఫలితం వచ్చింది.