Chandrababu :    ప్రపంచంలోనే తెలుగువారు నంబర్‌వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్షని తెలుగుదేశం  అధినేత చంద్రబాబు (ChandraBabu) స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన బెంగళూరు టీడీపీ ఫోరం  సమావేశంలో ఆయన మాట్లాడారు.  ముఖ్యమంత్రిగా ఐటీని ప్రోత్సహించాలనుకున్నప్పుడు  విజన్‌-2020 అని చెప్పినప్పుడు నన్ను హేళన చేశారన్నారు. రైతు బిడ్డ ఐటీలో ఎందుకు పనిచేయకూడదు అని ఆలోచన చేశానని.. 30 సంవత్సరాల క్రితం చేసిన ఆలోచనతో ఈ రోజు ఇంత మంది ఐటీ ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు.  థింక్ గ్లోబలీ... యాక్ట్ గ్లోబలీ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా గ్లోబలీ పనిచేసే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆ ఫలాలు అందరూ అనుభవిస్తున్నారని తెలిపారు.పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం. పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలన్నారు. 


తనకు కష్టం వచ్చినప్పుడు అంతా అండగా నిలబడ్డారని బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులను ప్రశంసించారు.  ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే అవకాశం భారత దేశానికే ఉందన్నారు. 2047 సంవత్సరానికి భారత దేశం నెంబర్ వన్‌గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. నవశకం తెలుగువారి శఖం అవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా తెలుగు ప్రజలు ఉండాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. బెంగళూరు టీడీపీ ఫోరంను చాలా పద్ధతిగా ఆర్గనైజ్ చేస్తున్నారన్నారని  ప్రశంసించారు. 


ఆడపిల్లకు చదువెందుకు అని అన్నారని... ఇప్పుడు ఆడపిల్లలు మగవారితో సమానంగా ఎదుగుతున్నారన్నారు. ఆడపిల్లకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజంను చూడాలన్నదే తన కోరికన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలని దే లక్ష్యమని స్పష్టం చేశారు. పీ4 వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని.. పీ4 అంటే పబ్లిక్ ప్రయివేట్ పీపుల్ పార్టనర్ షిప్ అని టీడీపీ చీఫ్  తెలిపరు.        


ఆంధ్రప్రదేశ్‌ని బాగు చేసేందుకు మీరు ఏం చేయగలరు ప్లాన్ చేయాలని సూచించారు.  వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. వచ్చే ఎన్నికలు ఎందుకు ముఖ్యమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.  ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని..   మీరు సంపాదించే దానిలో 5 శాతం  సమాజం కోసం ఖర్చు చేయాలని సూచించారు.  సమాజహితం కోసం మీరు కష్టపడాలి. నాకోసం కాదు నేను చేసే పనులు తర తరాలు గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటే నా జన్మ దన్యమైనట్లేనన్నాుర.  బెంగళూరులో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు కుప్పంకు బయలుదేరి వెళ్లారు. కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.