Chandrababu :  మొత్తం 151 మందిని మార్చినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలవరని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. మూడు నెలల తర్వాత మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు.  సీఎం జగన్ 11 మంది వైసీపీ ఇంచార్జులను మార్చడంపై ఆయన స్పందించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే 11 మంది ఇంచార్జులను మార్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసులు.. మరో చోట చెల్లుతాయా అని ప్రశ్నించారు. ప్రజలను వైసీపీ ఎమ్మెల్యేలు భయబ్రాంతులకు గురి చేశారని.. తిరుగుబాటు మొదలుకావడంతో సీఎం జగన్ మార్పులకు తెరతీశారని చంద్రబాబు సెటైర్ వేశారు 


పులివెందుల సీటున బీసీలకు ఇచ్చే దమ్ముందా ? 


జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే ఐదుగురు దళిత నేతలను బదిలీ చేశారని వ్యాఖ్యానించారు. బీసీలపై ప్రేమ ఉందని చెప్పుకునే వైసీపీ నాయకులు పులివెందుల సీటును వారికి ఇవ్వమని సీఎం జగన్‌ను అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. బలా బలాలను బట్టే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, కుప్పంలోనూ ప్రజాభిప్రాయం సేకరిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.


రైతులను నట్టేట ముంచిన జగన్ నిర్లక్ష్యం 


మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. తుపాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు.  మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. తుపాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 


పట్టి సీమ నీరు ముందే విడుదల చేసి ఉంటే పంట నష్టం తగ్గేది !


పట్టిసీమ నీటిని విడుదల చేసి ఉంటే పంట ముందుగానే చేతికి వచ్చేదన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపానుల బారి నుంచి పంటలు కాపాడుకునేవాళ్లమన్నారు. తాను పట్టిసీమ కట్టానని జగన్ నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ప్రభుత్వాన్ని తంతారని భయంతో విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారని.. కానీ అప్పటికే ఆలస్యమైందన్నారు. పంటలు తుపాను బారిన పడ్డాయన్నారు. ప్రాజెక్టుల మెయిన్టెన్సును పట్టించుకోవడం లేదని.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకెళ్లిందని తెలిపారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయన్నారు. గేట్ల రిపేర్లు చేయడం లేదని.. నిర్వాహణ కూడా అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. రిపేర్లు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పంట కాల్వల నిర్వహణ సరిగా చేయడం లేదన్నారు. సీఎం కానీ.. మంత్రులు కానీ కనీస చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యవస్థలు నాశనం చేశారని చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.