Chandrababu Naidu gives warning to ministers:  వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలపై ఎందుకు స్పందించడం లేదని మంత్రులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ భేటీలో ఎజెండాపై చర్చ ముగిసిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు రాజకీయ అంశాలపై తక్షణ స్పందన ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ అత్యంత దారుణంగా మాట్లాడితే.. స్పందించడానికి ఎందుకు సమయం తీసుకున్నారని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. 

వైసీపీ తప్పుడు ప్రచారాలపై వేగంగా స్పందించలేదని చంద్రబాబు అసంతృప్తి         

గతంలో సబ్జెక్టు ప్రకారం రాజకీయాలు నడిచేవన్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రకారం రాజకీయాలపై చర్చ జరగడం లేదని.. తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలు చేయడం మీదనే రచ్చ చేస్తున్నారని  గుర్తు చేశారు. ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించి.. వెంటనే కౌంటర్లు ఇవ్వాలని.. ప్రజలకు మంత్రులే నిజాలు చెప్పాలని స్పష్టం చేశారు. గతంలోలా మెతకగా ఉండనని స్పష్టం చేశారు. 1995 సీఎంను చూస్తారని.. రాజకీయంగా కౌంటర్లు ఇవ్వకపోతే..  మీ స్థానంలో వేరే మంత్రులు వస్తారని హెచ్చరించారు. ఎవరికీ పదవుల గ్యారంటీ ఉండదన్నారు.  గత కేబినెట్ సమావేశాల్లోనూ చంద్రబాబ ు కొంతమంది మంత్రుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మంత్రులు తమ విధుల పట్ల తీవ్రంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. "ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మంత్రులు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.            

గతంలోనూ కేబినెట్ భేటీలో చంద్రబాబు అసంతృప్తి 

మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని.. కార్యకర్తలు, నేతలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  కార్యకర్తలు, నేతలకు మంత్రులు గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని.. కార్యకర్తలు, నేతలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  కార్యకర్తలు, నేతలకు మంత్రులు గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. పెట్టుబడులు అడ్డుకునేలా వైసీపీ కుట్రలు చేస్తోందని.. వారిపై విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

ఏపీకి అప్పులు, పెట్టుబడులు  రాకుండా.. తప్పుడు ఈ మెయిల్స్            

ఆంధ్రప్రదేశ్ కు అప్పులు రాకుండా, పెట్టుబడులు రాకుండా వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపుగా రెండు వందల మేర ఫేక్ ఈమెయిల్స్ పంపారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ కేబినెట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ అంశంపై తనకు సమాచారం రావడంతో పంపించిన వ్యక్తి ఎవరో ఆరా తీశానని ఉదయ్ భాస్కర్ అనే జర్మనీలో ఉండే వైసీపీ సానుభూతిపరుడితో ఈ ఫేక్ ఈమెయిల్స్ పంపించారని గుర్తించారు. ఈ అంశంపై చంద్రబాబు స్పందించారు. ఏపీపై కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే.. ఈ అంశంపై ప్రజలకు నిజాలు వివరించాలన్నారు.