White Liquor In Hyderabad News | హైదరాబాద్: కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఒకరు చనిపోగా, ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృతిచెందాడని సమాచారం. మృతులను తులసిరామ్ (47), స్వరూప గుర్తించారు. కల్తీ కల్లు తాగి చనిపోయిన వారు హెచ్‌ఎంటీ హిల్స్ సాయిచరణ్‌కాలనీకి చెందినవారిగా గుర్తించారు. కల్లు కాంపౌండ్ నిర్వాహకులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఐదుగుర్ని అరెస్ట్ చేశారని సమాచారం.
కూకట్‌పల్లిలో కల్తీకల్లు కలకలంహైదరాబాద్ లోన కూకట్ పల్లి ఏరియాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. కల్తీ కల్తు తాగి మొత్తం 20 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరికొందరు పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వనపర్తి జిల్లా తాగిన ఘటనలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వనపర్తి జిల్లాకు చెందిన సీతారాం (47) చనిపోయాడు. వనపర్తి జిల్లా మదిగట్లకి చెందిన సీతారాం, అనిత దంపతులకు సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ రాగా, సీతారాం మేస్త్రీ పని చేస్తున్నాడు.
బాధితులను పరామర్శించిన జూపల్లి కృష్ణారావుకూకట్ పల్లిలోని కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికాగా, ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు ఐదుగుర్ని అరెస్టు చేశారు. కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. బుధవారం నాడు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాధితులకు అండగా ఉంటామన్నారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న కారణమైన కల్లు కాంపౌండ్‌ను సీజ్ చేసినట్టు మంత్రి జూపల్లి తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కల్లు కౌంపాండ్ లపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ కన్నేసి ఉంచాలని, కల్తీ లేకుండా విక్రయాలు చేయాలన్నారు.