Chandrababu  helicopter :  చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారి తప్పింది. అరకు నియోజకవర్గంలో రా కదలిరా బహిరంగసభకు  హాజరయ్యేందుకు  చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైలట్ రూట్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఏటీసీ సూచనలు అర్థం చేసుకోలేకపోవడంతో సమస్య ఏర్పడింది. రాంగ్ రూట్‌లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్ కరెక్ట్ రూట్‌లో అరుకులో ల్యాండ్ చేయగలిగారు. దీంతో కాసేపు ఉత్కంఠ ఏర్పడింది.                                   


రా కదలిరా సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు చంద్రబాబు. అక్కడ నుంచి అరకు వెళ్లేందుకు హెలికాఫ్టర్ రెడీ చేసుకున్నారు. సాధారణంగా వాయుమార్గంలో ప్రయాణించాలంటే సమీపంలోని విమానాశ్రయ ఏటీసీ క్లియరెన్స్ తప్పనిసరి. వారు రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ ప్రకారం అరకు వెళ్లేందుకు హెికాఫ్టర్ కు కూడా రూట్ ఖరారు చేశారు. అయితే పైలట్ గందరగోళానికి గురి కావడంతో  నిర్దేశిత మార్గం లో కాకుండా వేరే మార్గం లో చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణించింది.  విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గం లో రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లిన హెలికాప్టర్ వెళ్లింది. ఈ విషయాన్ని ఏటీసీ వెంటనే గుర్తించింది.  ఏటీసీ హెచ్చరించడం తో అప్రమత్తం అయిన పైలట్ సరైన రూట్‌లో తీసుకెళ్లారు.                               


అరకు తో పాటు మన్యం మొత్తం నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కావడం , చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత కావడంతో  హెలికాఫ్టర్ దారి ప్పిందని తెలియడంతో అధికారులు కంగారు పడ్డారు. అయితే కాసేపటికే మళ్లీ సరైన దారిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్ని జోరుగా నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు చొప్పున బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు సభలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హెలికాఫ్టర్‌లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఉండవల్లి నివాసంలో ఓ హెలిప్యాడ్ ను రెడీ చేశారు. అలాగే ఎక్కడ సభలు జరుగుతున్నాయో ఆ సభా ప్రాంగణానికి దగ్గర్లో మరో హెలిప్యాడ్ రెడీ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ ఇలా సమన్వయ లోపం జరగలేదని.. రాంగ్ రూట్‌లో వెళ్లేంత ఇబ్బందికర పరిస్థితులు రాలేదని అంటున్నారు. ఇక్కడ పైలట్.. ఏటీసీతో సమన్వయం చేసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని.. వెంటనే ఏటీసీ నుంచి  హెచ్చరికలు రావడంతో మళ్లీ సరైన విధంగా గమ్యస్థానం చేరుకున్నారని చెబుతున్నారు. ఈ అంశంపై సంబంధిత వర్గాలతో పాటు చంద్రబాబు  భద్రతా సిబ్బంది కూడా ిచారణ జరిపే అవకాశం ఉంది.