AP DSC Notification Cancelled | అమరావతి: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేశారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  వైఎస్ జగన్ ప్రభుత్వం 6,100 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నిర్ణయం తీసుకోగా, ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం కూడా చేశారు. ఆపై ఏపీ కేబినెట్ డీఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపింది.


16,347 పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ఏపీ మంత్రులు వెల్లడించారు. మరోవైపు జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న క్రమంలో జగన్ సర్కార్ ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జులై 1న ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇటీవల ఏపీ కేబినెట్ భేటీలో డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ ఎగ్జామ్ కు ఆమోదం తెలిపారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నందున వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి పోస్టులు పెంచుతూ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు.


Also Read: AP TET: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో మరో 'టెట్' పరీక్ష నిర్వహణ, వెల్లడించిన మంత్రి లోకేశ్