Quantum computing: క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మనం అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ప్రమోట్ చేయాలనుకున్న సమయంలోనే భారత ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్‌ను అనౌన్స్ చేసిందని చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో జరిగిన వర్క్ షాప్‌లో చంద్రబాబు ప్రసంగించారు. తాను వెంనటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగానని వారు ఓకే చెప్పారన్నారు. ఈ రంగంలో మరింతమంది ముందుకు రావాలని ఎకో సిస్టంను టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ ద్వాారా చేయగలిగామని.. ఐటీపై ఆలోచన చేస్తే చాలదన్నారు. క్వాంటం కంప్యూటింగ్ రంగం అభివృద్ధి చెందే వాతావరణం ఉండాలన్నారు.
ఇంటర్నెట్ వల్ల ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్‌గా మారిందన్నారు. ఐటీ రంగానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్లనే ఇప్పడు హైదరాబాద్ ప్యూచరిస్టిక్ టెక్నాలజీలకు వేదికగా మారిందని గుర్తు చేశారు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని.. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. 1989లో కుప్పం నుంచి పోటీచేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్‌లో తాను ఎలక్ట్రానిక్ ఎక్సేంజ్ తెస్తానని చెప్పానని.. అయితే ఆ విషయంతో తన ప్రత్యర్థులు తప్పుపట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వ సర్వీసులు అన్నిసేవలను ఆగస్టు 15వ తేదీ నాటికి వాట్సాప్ చాట్ బోట్ ద్వారానే నిర్వహిస్తాయని చంద్రబాబు తెలిపారు.
జనవరి ఒకటోవ తేదీ నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతి నుంచి ప్రారంభమవుతుందన్నారు. దీనికోసం ఎకో సిస్టంతో పాటు యూజ్ కేస్‌లు కూడా రావాలని.. టాప్ ఏఐ యూసేజ్‌లో చైనా, యూఎస్, ఇండియా మాత్రమే ముందు ఉన్నాయని గుర్తు చేశారు. టిసీఎస్ మనతో ముందునుంచి ట్రావెల్ చేస్తోందని.. ఇప్పుడు డేటాలింక్‌పై పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు.
బ్రిటిష్ వాళ్లు మన కోహినూరు డైమెండ్‌ను తీసుకుపోయినా.. ఇక్కడ ఇంగ్లీష్ వదిలి వెళ్లారు. మొదటి సారి సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమల కోసం అమెరికా వెళ్లినప్పుడు పరిశ్రమకు ఏమి అవసరమో గుర్తించి.. దానికి తగ్గట్లుగా అనేక ఇంజనీరింగ్ కాలేజ్‌లు ప్రారంభించి ఐటీ ఎడ్యూకేషన్‌ను పెంచాననన్నారు. ఇప్పడు హైదరాబాద్ ప్యూచరిస్టిక్ టెక్నాలజీలకు వేదికగా మారింది. గతంలో ఎక్కువ ఫోన్ బిల్లు వస్తుందని నేను లోకేష్‌కు అమెరికా కూడా ఫోన్ చేయలేకపోయానని.. ఇతర దేశాల్లో పరిణామాలు చూశాను... సెల్‌ఫోన్ తేవాలని చెప్పాను. అయితే అప్పట్లో పేదరికం గురించి మాట్లాడేవారు...సెల్‌ఫోన్ ఎలా అన్నారు. ఇప్పడు భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త జీవించగలుగుతున్నారు. అయితే వీరిద్దరూ సెల్ లేకుండా ఉండలేకపోతున్నారని చంద్రబాబు చమత్కరించారు.