రాజధాని అంశంపై సీఎం జగన్.. నిర్ణయాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని.. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.  రాజధానిపై సీఎం వైఖరితో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. అంతేగాకుండా.. ఆదాయానికీ భారీగా గండి పడుతుందని చెప్పారు.  


అసెంబ్లీలో చర్చ


మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.  త్వరలోనే సమగ్రమైన బిల్లులతో మళ్లీ అసెంబ్లీలో ప్రవేశ పెడతామని ప్రకటించారు.  పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కొత్త బిల్లులు ప్రవేశ పెట్టింది. గతంలో ఉన్న సీఆర్డీఏను పునరుద్ధరించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును కూడా రద్దు చేస్తున్నట్లుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు.  భాగస్వాములతో సంప్రదింపులు జరపకపోవడం, శాసనమండలిలో  బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లడం వంటి కారణాల వల్ల బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా బుగ్గన చెప్పారు. 


ఈ అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామన్నారు.    1953 నుంచి 1956 వరకూ కర్నూలులో రాజధాని..గుంటూరులో హైకోర్టు ఉండేదని గుర్తు చేశారు.  రాజధాని ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని.. తనకు ఇక్కడే ఇల్లు ఉందన్నారు. ఈ ప్రాంతం అంటే తనకు ప్రేమ అని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం  శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి రాజధానిని ఖరారు చేసిందని.. అలా ఎంపిక చేసిన  ప్రాంతం..  అటు గుంటూరు కాదు.. ఇటు విజయవాడ కాదని ఆక్షేపించారు.


పూర్తి వివరాలు సమర్పించాలి: హైకోర్టు


మరోవైపు అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వివరాల సమర్పణకు కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


Also Read:What Is Jagan Plan : సాగు చట్టాల విషయంలో కేంద్రంలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకుందా ? కొత్త మార్గంలో 3 రాజధానులు తెస్తారా ?


Also Read: Three Capitals Chronology: మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఉపసంహరణ వరకూ ఎప్పుడు ఏం జరిగింది..?


Also Read: Three Capitals Jagan : త్వరలో మూడు రాజధానుల కొత్త బిల్లులు ... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన !