Chandrababu Case :  స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు కేసు విషయంలో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ( AP HIgh court )  వాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబు తరపున సిద్దార్థ లూధ్రా, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వనిపించారు. వాదనల తర్వాత తీర్పును రిజర్వు చేస్తున్నట్లుగా హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. అసలు తనపై నమోదు చేసిన కేసులన్నీ చట్ట వ్యతిరేకమని.. ఏసీబీ యాక్ట్ లోని చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదని.. సుప్రీంకోర్టులో ( Supreme Court ) దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. పలుమార్లు వాయిదా పడిన తర్వతా దీపావళి సెలవుల తర్వాత తీర్పును ప్రకటిస్తామని ధర్మానసం ప్రకటించింది. ఆ తీర్పు చంద్రబాబు కేసుల విషయంలో అత్యంత కీలకం కానుంది.   

  


ఇప్పటికే చంద్రబాబు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్నారు.   చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రభుత్వ పెద్దలకు కాదన్నారు. అడ్వకేట్ ఎథిక్స్ విరుద్ధంగా డిల్లీలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు ప్రచారం చేశారన్నారు.   చంద్రబాబు గుండె, చర్మ సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును ఇరికించేందుకే ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు చేశారని ఆరోపించారు. ఇప్పటికే చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స జరిగిందని..ఇందుకోసం మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలియజేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని...దానికి మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని అందువల్లే రెగ్యులర్ బెయిల్ కోరుతున్నట్లు హైకోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 2018లో నుంచి విచారణ జరుగుతోందంటున్నారని.. ఇప్పటికే ఏం తేల్చలేకపోయారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
  
అయితే  చంద్రబాబుకు  రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని.. మెడికల్ రిపోర్టులు తప్పుడువని ఏఏజీ పొన్నవోలు  సుధాకర్ రెడ్డి కోర్టులో వాదించారు.  స్కిల్ స్కాం కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్లు చేతులు మార్చారని ఏఏజీ పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం బయట పడిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. బోస్, కన్వేల్కర్ మెసేజ్‌ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీమెన్స్ కంపెనీ కుంభకోణం జరిగిందని..నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారని తెలిపిందన్నారు.  


ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబబు మధ్యంతర బెయిల్ పూర్తయ్యే లోపు తీర్పు ప్రకటించకపోతే.. మరోసారి చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.