Kurnool Chandrababu Tour :  తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కర్నూలు జిల్లా పారిశ్రామిక  హబ్ అయి ఉండేదని.. నిరుద్యోగం అనే మాటే ఉండేది కాదని చంద్రబాబు కర్నూలులో వ్యాఖ్యానించారు. కర్నూలు పర్యటనకు వెళ్లిన ఆయనకు ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులు కూడా ఆయనకు స్వాగతం చెప్పేందుకు వచ్చారు. వారితో ముఖాముఖి నిర్వహించారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇబ్బందులను విద్యార్థులు చెప్పుకున్నారు. ‘జాబు రావాలి అంటే.. బాబు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేరులో వెళుతుందని చంద్రబాబు విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు.

  





రాష్ట్రానికి  పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత  నాదే 


రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.  ఈ విషయంలో నాకంటే చెప్పేవాడు కానీ, చేసేవాడు కానీ ఎవరూ లేరన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నారు. అవి కొనసాగి ఉంటే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవని, అప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్టు ఎవరు కట్టారని ప్రశ్నించారు.  కర్నూల్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చామన్నారు. కర్నూలు జిల్లాకు సీడ్ పార్క్ తెచ్చామని, సోలార్ పార్క్ తెస్తే కమీషన్‌ల కోసం జగన్ రెడ్డి నిలిపివేశారని.. అది సెట్ చేసుకుని మళ్లీ ప్రారంభించారని చంద్రబాబు అన్నారు. 


బెదిరించి భూములు రాయించుకుంటున్నారు వైసీపీ నేతలు 


అభివృద్ధికి టీడీపీ మారుపేరన్నారు. ప్రతి కార్యక్రమం ఇక్కడ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు.హైదరాబాద్ లో ఇవాళ ఐటి రంగం ఇంతగా అభివృద్ధి అవడానికి కారణం ఆ రోజుల్లో మేము చేసిన అభివృద్ధే కారణం అన్నారు.  చాలా మంది ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు..అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు.  సీఎం జగన్ మూడు ముక్కలు అడి అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వ భూములను జగన్,ఏ2 విజయసాయి రెడ్డి కొట్టేస్తున్నారన్నారు. .బెదిరించి,గొంతు మీద కత్తి పెట్టి భూములు రాయించుకున్నారని విమర్సఇంచారు.  రాయలసీమలో ఒక్కప్పుడు కక్షలు ఉండేవి, నేను సీఎం అయిన తరువాత తగ్గించారు.. కానీ ఇప్పుడు వైసీపీ నేతల తీరు వల్ల మళ్ళీ ఫ్యాక్షన్ పెరుగుతోందన్నారు. 


రైతుల ఆత్మహత్యలు ఎక్కువ మన రాష్ట్రంలోనే !


పర్యటనలో భాగంగా కోడుమూరు సెంటర్‌లోనూ చంద్రబాబు ప్రసంగించారు.  రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి విజయ భాస్కర్ రెడ్డి అని ప్రశంసించారు. అవినీతి కి, అక్రమాలకు ప్రతిరూపం జగన్ రెడ్డన్నారు.  నీరు ఉండే ప్రాంతాలు, airport సహా అన్ని నంద్యాల జిల్లాకు వెళ్ళాయని..  రోడ్ల మీద గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం...మూడు రాజధానులు కడతాడా అని ప్రశఅనించారు.  చివరికి చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ రెడ్డి అని మండిపడ్డారు.  దేశం ల ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉండేది మన రాష్ట్రం లోనే దేమి ఖర్మ మనకు? ఈ శనికి కారణం జగన్ మోహన్ రెడ్డని మండిపడ్డారు.  పోలీసుల పొట్ట కూడా కొట్టిన ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డని మండిపడ్డారు.  తప్పు చేసిన అధికారులను వదలం...జగన్ను నమ్మితే జైలుకే పోతారని హెచ్చరించారు.  డోన్ లో అప్పుల మంత్రి మా కార్యకర్త కాంపౌండ్ వాల్ కూల్చాడని.. తాను  అనుకుంటే ఆ హరికథల మంత్రి ఏమవుతాడని ప్రశ్నించారు. 



పర్యటనలో భాగంగా కోడుమూరు సెంటర్‌లోనూ చంద్రబాబు ప్రసంగించారు. కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షించి..  అభ్యర్థులను ఖరారు చేసే లక్ష్యంతో చంద్రబాబు మూడు రోజుల పాటు కర్నూలులో పర్యటించనున్నారు. రెండు వేర్వేరు చోట్ల బస చేస్తారు. ఆదోనిలో ఓ రోజు.. కర్నూలులో మరో రోజు  బస చేస్తారు. పార్టీని సెట్ రైట్ చేసి.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి..ఆయన తిరిగి రానున్నారు. ఇలా ప్రతీ జిల్లాకూ  మూడు రోజులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.