BC Declaration Chandrababu : వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.  బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలన్నారు. మంగళగిరి బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు ప్రసంగించారు.  40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ.. టీడీపీ - బీసీల డీఎన్‌ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందన్నారు.   బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తెచ్చామని తెలిపారు. 


బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ 


 బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం - బీసీలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామని ప్రకటించారు.  బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని..   వైసీపీ పాలనలో సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.  జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని..  - రేజర్వేషన్ తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని విమర్శించారు.   ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్ పదవులు ఇస్తాం  చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టాల్సి లఉందన్నారు.  బీసీల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలని.  - బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 


బీసీ భరోసాకు ప్రత్యేక రక్షణ చట్టం


బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం ఇది అవసరమని చంద్రబాబు తెలిపారు.   బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు.  పరిశ్రమలు పెట్టేలా బీసీ వర్గాలను ప్రోత్సహిస్తామన్నారు.  బీసీలకు షరతులు లేకుండా విదేశీవిద్య పథకం అమలు చేస్తామని..  - పెళ్లికానుకను తిరిగి ప్రవేశపెడతామని భరోసా ఇచ్చారు.   ప్రతి ఏడాది కుల ధ్రవీకరణ తీసుకునే వ్యవస్థ రద్దు చేస్తాం  శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చారు.  చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు ఇస్తామని..   లంచాలు లేకుండా బీసీలకు ధ్రువపత్రాలు ఇచ్చేలా చూస్తామన్నారు.   మేం వచ్చిన ఏడాదిలోగా బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేస్తామని ప్రకటించారు. 


బీసీల దశ, దిశ మార్చడం కోసమే బీసీ డిక్లరేషన్


బీసీల దశ, దిశ మార్చడం కోసమే బీసీ డిక్లరేషన్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు.  బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదు.. నాగరికతకు వారే మూలమన్నారు.   చెరువులు, దోబీఘాట్‌లపై మళ్లీ హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  పరిశ్రమలు పెట్టేలా కురబ, యాదవలను ప్రోత్సహించామని  యాదవుల జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇస్తున్నామన్నారు.   బీసీల్లో ఉన్న 157 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ..  టీడీపీ వచ్చాకే బీసీల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు, యనమల, కళా వెంకట్రావుపై కేసులు పెట్టారు. బీసీ నాయకత్వంపై గొడ్డలివేటు వేసిన పార్టీ వైసీపీ.  ఎంపీ ఇస్తామన్నా వదులుకుని గుమ్మనూరు టీడీపీలోకి వచ్చారని గుర్తు చేశారు.   బీసీలను ఊచకోత కోసే పల్నాడు వైసీపీ నేతలను మార్చగలరా అని సవాల్ చేశారు.  


నలుగురు రెడ్లతో  పెత్తందారి  వ్యవస్థ


నలుగురు రెడ్లతో పెత్తందారి వ్యవస్థను నడుపుతున్నారని..  - సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు.   బీసీలంటే పల్లకీలు మోసే బోయీలు కాదని నిరూపించాలని పిలుపునిచ్చారు.  బీసీలంటే బ్యాక్‌బోన్ సొసైటీ అని నిరూపించాలి   పదవులు, అధికారం కోసం మేం పోరాడటం లేదు  భావితరాల భవిష్యత్తు కోసమే నేను, పవన్ పోరాడుతున్నామన్నారు. ల మంగళగిరిలో అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత  తనదేనన్నారు.   మంగళగిరిలో 20 వేల టిడ్కో ఇళ్లు నిర్మించి ఇస్తాం - చేనేత కార్మికుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం - మేం వచ్చాక స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.  - మేం వచ్చాక అమరావతిలో యూ-1 జోన్ ఎత్తివేస్తాం - రాష్ట్ర భవిష్యత్తుకు రాబోయే ఎన్నికలు చాలా కీలకం - నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బీసీలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.