ఏపీ రాజధాని విశాఖ అని కేంద్రం లోక్ సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చర్చనీయాంశం అయ్యింది. దీనిపై కేంద్రం తిరిగి క్లారిటీ ఇచ్చింది. జులై 26న లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా విశాఖపట్నం అని పెట్రోలియం శాఖ పేర్కొంది. దీనిపై ఆ శాఖ ఆదివారం రాత్రి తిరిగి వివరణ ఇచ్చింది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. పెట్రో పెరుగుదలకు సంబంధించి ఒక ప్రతిపాదికన రెఫరెన్స్ సిటీగా తీసుకున్నట్లు పేర్కొంది. దేశంలో పెట్రో ధరల పెరుగుదల వల్ల ప్రభావం గురించి జులై 26న కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో విధిస్తున్న పన్నులు వెల్లడించారు.
తప్పు సరిద్దిద్దుకున్నాం
రాష్ట్రాల పేర్లు, పక్కన రాజధాని/నగరం అని ఉండాల్సిన చోట కేవలం రాజధాని పెట్రోలియంశాఖ పేర్కొంది. ఈ డాక్యుమెంట్ లో ఏపీకి విశాఖ రాజధాని అని ఉంది. అదే కాకుండా హరియాణాకు అంబాలా, పంజాబ్‌కు జలంధర్ అని పేర్కొన్నారు. ఈ అంశాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీంతో తప్పును సరిదిద్దుకున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. సమాధానంలోని రాజధాని అన్న హెడ్డింగ్ కింద ఇచ్చిన నగరాలను కేవలం ఆ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి చెప్పడానికి నిర్దేశించామని వెల్లడించింది. ఆ హెడ్డింగ్‌ను కేవలం రాజధాని అని మాత్రమే కాకుండా రాజధాని లేదా రిఫెరెన్స్ సిటీగా చదువుకోవాలని కోరుతున్నామని తెలిపింది. ఈ మేరకు మార్పు చేసి లోక్‌సభ సచివాలయానికి తెలిపామని పెట్రోలియం శాఖ పేర్కొంది.
Also Read: Petrol-Diesel Price, 30 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో బాగా తగ్గుదల, తాజా రేట్లు ఇవే..
చంఢీగఢ్ విషయంలోనూ
ఏపీ రాజధాని హైదరాబాద్, అమరావతి అని ఒక్కొసారి ఒకో విధంగా కేంద్రం లేఖలు పంపుతుండడం వివాదాలు దారితీస్తుంది. లోక్‌సభకు ఇచ్చే సమాధానాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అని పేర్కొంది. ఏపీ రాజధాని వ్యవహారంలో ఉన్న సున్నితత్వాన్ని గుర్తించకుండా లోక్‌సభలో ఉదాసీనంగా సమాధానాలు ఇస్తూ చర్చకు కారణమౌతోంది. చంఢీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా పేర్కొంటూ హరియాణాలో పెద్ద నగరమైన అంబాలా, పంజాబ్‌లో పెద్దదైన జలంధర్‌కు సంబంధించిన పెట్రో ధరల సమాచారం ఇవ్వడం పెద్ద గొడవకే దారితీసింది.చంఢీగఢ్ కోసం రెండు రాష్ట్రాలు గొడవ పడుతుండటంతో వాటిని పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తున్నారు.
Also Read: Tank Bund: ట్యాంక్ బండ్ మీద వాహనాలకు నో ఎంట్రీ.. పర్యాటకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి