తెలుగు రాష్ట్రల్లో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నాయి. 


ఏపీలో వర్షాలు



బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం అనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 km ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


సోమవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో సత్తెనపల్లిలో 8.3 సెం.మీ, కాకుమానులో 8.0, గుంటూరులో 7.9, రాజాంలో 7.5, నిజాంపట్నంలో 7.1, పొన్నూరులో 6.3, నాగాయలంకలో 5.8, మార్తూరులో 5.5, తెనాలిలో 5.4, తెర్లాంలో 5.3, నిడుబ్రోలులో 5.1, ఎస్‌.కోటలో 5.0 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.


ఉత్తర కోస్తాలో 


అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడింది. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కూడా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


రాయలసీమలో 


ఇవాళ దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 


Also Read: Gold-Silver Price: మీ నగరంలో పసిడి, వెండి రేట్లు ఇలా.. స్వల్పంగా పెరిగిన బంగారం



తెలంగాణలో వర్షాలు


తెలంగాణలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో పాటు జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణశాఖ తెలిపింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపు ఒకటి రెండు చోట్ల భారీ వానలు పడవచ్చని అంచనా వేస్తోంది. ఇవాళ ఉదయం 08.30 నుంచి ఆగస్టు 31 ఉదయం 08.30 వరకు ఆదిలాబాద్, కుమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని సూచించింది. 


Also Read: TTD Electric Vehicles: తిరుమలలో కాలుష్యానికి చెక్.. ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన టీటీడీ.. వారికి మాత్రమే వాహనాలు