ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన కోసం సీబీఐ కోర్టు అనుమతించింది. ఆయన ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లేందుకు సీబీఐ కోర్టును ఇటీవలే అనుమతి కోరారు. కుటుంబంతో కలిసి జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తాను తన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని జగన్ తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. అంతేకాక, లండన్‌లో తన కుమార్తెలు చదువుకుంటున్నారని.. వారితో కొన్ని రోజులు గడపడం కోసం కూడా అక్కడికి వెళుతున్నట్లు జగన్ చెప్పారు.


సీబీఐ అభ్యంతరం


అయితే జగన్ విదేశీ పర్యటన కోసం అనుమతి పిటిషన్ పై సీబీఐ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని.. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేసింది. అయినా ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.