Candidates for MLA Quota MLC Elections | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్యతో పాటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శి అయిన పిడుగు హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. సి. రామచంద్రయ్య, పిడుగు హరి ప్రసాద్‌లు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగళవారం (జులై 2న) నామినేషన్ దాఖలు చేయనున్నారు.


ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. జులై 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 3న అభ్యర్థుల ఆ నామినేషన్లను పరిశీలించనున్నారు. అభ్యర్థులు జులై 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. జులై   12న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహించి, అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.  


టీడీపీలో చేరిన రామచంద్రయ్య, ఇక్బాల్                       
వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. వైసీపీ నేతల ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ మోషేన్‌ రాజు.. సీనియర్ నేత రామచంద్రయ్యపై అనర్హత వేటు వేశారు. మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా టీడీపీలో చేరగా.. ఆయనపై కూడా అనర్హతా వేటు వేటు పడటంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.  


ఎమ్మెల్యే కోటాలో పూర్తి బలమున్న ఎన్డీఏ కూటమి           
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో 2 ఎమ్మెల్సీ స్థానాలూ ఎన్డీయే దక్కనన్నాయి. వైసీపీ పోటీ పెట్టే  అవకాశం లేదు. దాంతో రామచంద్రయ్యతో పాటు జనసేన నుంచి హరి ప్రసాద్ కు కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. దాంతో కూటమి 164 సీట్లున్న కూటమికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి.