Brother Anil Kumar Comments: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కడప పార్లమెంటు సీటుపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలోనే ఓ సమావేశంలో ఆయన ఆదివారం (ఏప్రిల్ 28) ఈ కామెంట్స్ చేశారు. పాపాలు చేసిన వారిని తొక్కిపడేయాలని బ్రదర్ అనిల్ కుమార్ పిలుపు ఇచ్చారు. మత ప్రచారకుడైన బ్రదర్ అనిల్ కుమార్ కడపలోని రాజారెడ్డి వీధిలో నిర్వహించిన ఓ మత సమావేశానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. పరోక్షంగా తన బావను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన సరిపోదని.. ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని.. ఎవరికీ భయపడొద్దని అన్నారు. అందరికీ దేవుడు అండగా ఉన్నాడని అన్నారు. దేవుడిపైనే విశ్వాసం ఉంచి ప్రజలు అందరూ నిర్ణయం తీసుకోవాలని బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడారు.
Andhra Pradesh: వాళ్లని తొక్కిపడేయండి, పాపం చేసిన వాళ్లని వదలొద్దు - బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు
Venkatesh Kandepu
Updated at:
28 Apr 2024 03:24 PM (IST)
Brother Anil: వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ సీఎం జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అయ్యాయి. కడప జిల్లాలోనే ఓ సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
బ్రదర్ అనిల్ కుమార్