YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలు నిందితుడు దస్తగిరితో ఎందుకు టచ్‌లో ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప ఎంపీ టికెట్ విషయంలో కుటుంబంలో వివాదాలు తలెత్తడంతోనే వివేకాను హత్య చేపించి, డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) మండిపడ్డారు.
నిందితులను జగన్ కాపాడుతున్నారా!
బాబాయ్ వివేకా హత్య కేసులో నిందితులను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నారని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని, వారిని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. వివేకా కేసు (Viveka Murder Case)లో నిందితులకు ఓ వైపు సహకరిస్తూ మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్ చేశారని బొండా ఉమా గుర్తుచేశారు. సీఎం అయిన తరువాత సీబీఐ విచారణ అవసరం లేదని వైఎస్ జగన్ చెప్పడం నిందితులను కాపాడటమేనని ఆరోపించారు.
అప్పుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్, ఇప్పుడు ఇలా
ప్రతిపక్షంలో ఉ/న్నప్పుడు అధికారం చేజిక్కించుకోవడం కోసం సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం కేసు విచారణ జాప్యం జరుగుతున్నా చూస్తూ కూర్చున్నారని, నిందితులను సైతం కాపాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో సీబీఐ విచారణ జరగాలా? అధికారంలోకి రాగానే వద్దా ? దీని ఉద్దేశం ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. త్వరలోనే వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తేలుతుందని, సీబీఐకి సహకరించి సీఎం జగన్ తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు.
సీబీఐ దర్యాప్తుపై పెరుగుతోన్న ఆసక్తి
వివేకా హత్య కేసుపై ఆయన కుతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒక్కోసారి ఒక్కో విధంగా కారణాలు చెబుతుండటంతో సీబీఐ దర్యాప్తుపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చడాన్ని సునీత వ్యతిరేకించకపోవడం అందుకు ఓ కారణం. తండ్రిని హత్య చేసిన నిందితులతో టచ్‌లో ఉంటూ సునీత నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. బెంగళూరులో భూ వివాదాల కారణంగా వివేకాను దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి ప్లాన్ ప్రకారం హత్య చేశారని సీబీఐ పేర్కొంది. కడప ఎంపీ టికెట్ కోసం అడ్డుగా ఉన్న వివేకాను వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి హత్య చేయించారని సైతం ప్రచారం జరుగుతోంది. సీబీఐ త్వరలోనే కేసు దర్యాప్తు పూర్తి చేసి దోషులను తేల్చుతుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: RK Beach Vizag: ఆర్కే బీచ్‌కు పోటెత్తుతున్న భక్తులు, వేకువజాము నుంచే పుణ్యస్నానాలు
Also Read: Sajjala : అంతా చంద్రబాబు కుట్రే, వివేకా హత్య కేసులో సునీతతో ఆడిస్తున్నారన్న సజ్జల