AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నడుపుతోంది కేబినెట్ కాదని సలహాదారులేనని ఏపీ బీజేపీ మండి పడింది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి దిశదిశా లేదని ..పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.  ప్రతినెలా డబ్బులు ఇస్తామని బటన్ నిక్కేందుకు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వగలరా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం దివాళా తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్రం గా మార్చారని విమర్శించారు. సలహాదారులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని.. చివరికి  రాజకీయ నిరుద్యోగికి దేవదయశాఖలో సలహాదారునిగా  నియమించే పరిస్థితి వచ్చిందన్నారు.  


శాఖలతో సంబంధం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారన్న ఏపీ బీజేపీ 


ఏపీ కేబినెట్‌లో ఒక్క మంత్రికి కూడా స్వతంత్రత లేదన్నారు. ప్రతి మంత్రి తన శాఖపై తప్ప ఇతర అన్ని అంశాలపై మాట్లాడతారని సెటైర్లు వేశారు.  విద్యాశాఖ మంత్రి సిపిఎస్ పై మాట్లాడతారు....అవగాహన లేక సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చామంటారని చెబుతూంటారని.. మరో వైపు  సమస్యలపై ఉధ్యమాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని విమర్శలు గుప్పించారు.  పోలీస్ రక్షణలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్తున్నారని..ప్రజల్లో కనిపిస్తున్న ఆగ్రహంతో వారంతా ఆందోళన చెందుతున్నారన్నారు. తాత్కాలిక పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారురని..  వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, వైసీపీకి ఓటు వేసిన వారు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని  స్పష్టం చేశారు. 


ఐదు వేల సభలతో  ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడతామన్న విష్ణు 


వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్ నిర్వాకాన్ని బీజేపీ ఎండ గడుతుందని విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు.  ప్రజాక్షేత్రంలో వైసీపీ తప్పుల్ని ఎత్తిచూపిస్తామని..  పలనా వైఫల్యాలపై బీజేపీ ప్రజా ఉద్యమం ప్రారంభించబోతోందని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.  ప్రజలకు వైసీపీ హామీలు ఇచ్చి వంచించిందన్నారు. వీటన్నింటినీ ప్రజలకు తెలియచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  5 వేల మినీ సభలు రాష్ట్రంలో నిర్వహిస్తాం...కేంద్ర,రాష్ట్ర ముఖ్య నేతలు సభల్లో పాల్గొంటారని విష్ణువర్థన్ రెడ్డి ప్రకటించారు.  ఏపీ కి కేంద్రం చేసిన సహకారం,  వైసీపీ చేసిన మోసాన్ని ప్రచారం చేస్తామన్నారు.  పెట్టుబడులకు కేంద్రం సహకరిస్తున్న వైసీపీ ప్రభుత్వం అందిపుచ్చుకుని పరిస్థితుల్లో లేదని.. జగన్ కు ఎన్నికలే పరమావధిగా ఉన్నాయని విమర్శించారు. 


బీజేపీపై విపక్షాల ఉచితాల అస్త్రం - మోదీ విధానాన్ని మార్చుకుంటారా ?


ప్రజాపోరు సభలను సక్సెస్ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు


ఏపీ బీజేపీ ఇటీవల యువ సంఘర్షణ ర్యాలీలు నిర్వహించి  ఏపీలో ..  ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంపై ఉద్యమం చేశారు. తాజాగా ఐదు వేల సభలు నిర్వహించి  ప్రజాపోరు చేపట్టాలని సంకల్పించారు. ఈ సభల బాధ్యతలను విష్ణువర్దన్ రెడ్డికి అప్పగించారు. కేంద్రమంత్రులు, మంత్రులు.. ఇతర కీలక నేతల్ని పిలిపించి సభలను విజయవంతం చేయడానికి విష్ణువర్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 


గణేష్ ఉత్సవాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన వైఎస్ఆర్‌సీపీ నేతలు - డ్రమ్ముల్లో భక్తులకు మద్యం సరఫరా !