ఢిల్లీలో అమృతవనంలో భాగస్వామ్యం అయ్యేలా బిజెపి రాష్ట్ర శాఖ  11వేల గ్రామాల నుంచి మట్టిని సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన మట్టిని ఆదివారం విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లనున్నారు. ఉదయం 8.30 గంటలకు బిజెపి కార్యకర్తలు సేకరించిన మట్టితో కూడిన కలశాలను శోభాయాత్రగా రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లనున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సివి రెడ్డి చారిటీస్ నుంచి శోభాయాత్ర గా రైల్వే స్టేషన్ వరకు శోభాయాత్ర సాగనుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి శోభాయాత్రను ప్రారంభించనున్నారు. ఉదయం 9గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ లో మట్టి కలశాలను ఢిల్లీకి తీసుకెళ్లే కార్యకర్తలకు పురంధేశ్వరి వీడ్కోలు పలకనున్నారు.