యూట్యూబర్ 'ప్రశ్న' రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అరెస్ట్ (Prashna Ravan Arrest Latest News) విషయంలో ఏపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. విమర్శల పర్వం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన ప్రతిసారీ నటుడు - నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై మరొకరు చేస్తున్న విమర్శలు ఇటు సినిమా, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. లేటెస్ట్ ట్విట్టర్ వార్ ఏమిటి? అనే అంశంలోకి వెళితే...
ప్రకాష్ రాజ్ భయపడ్డారా?మీరు దిగజరుతూ ఉండండి!యూట్యూబర్ రావణ్ అరెస్ట్ మీద ఉపా చట్టం కేసు నమోదు చేయడంపై ప్రకాష్ రాజ్ ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అయితే, రావణ్ ఫోన్ నుంచి డేటా తీసిన తర్వాత ప్రకాష్ రాజ్ మౌనంగా ఉండటంతో... ఏవో లొసుగులు బయట పడ్డాయని, ఆయన భయపడిపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు కొందరు. వీటికి సమాధానంగా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్. అందులో జనసేనపై, అలాగే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "దిగజారండి... దిగజారండి... దిగజారుతూనే ఉండండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తాను మౌనంగా లేనని... ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కొన్ని మీడియా ఛానళ్ల తీరును గమనిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇంకా "ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే... మీరు ఎంత అరిచినా నాలాంటి ప్రశ్నించే గొంతును ఆపలేరు" అని ఆయన స్పష్టం చేశారు.
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ''నీ పని నువ్వు చూసుకో... తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదు" అంటూ బండ్ల చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ప్రకాష్ రాజ్ చేస్తున్న విమర్శలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అలాగే... ''పైసా కొట్టు… డైలాగ్ పట్టు! ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ ఫ్రమ్: కర్ణాటక'' అంటూ బండ్ల గణేష్ చేసిన సెటైరికల్ ట్వీట్ జనాల దృష్టిని ఆకర్షించింది. అలాగే, ప్రకాష్ రాజ్‌ను ఎనీ టైమ్ మనీగా అభివర్ణించారు. అకౌంట్‌లో డబ్బులు పడితే ఆయన స్వరం మారుతుందున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - ఇద్దరికీ బండ్ల గణేష్ చాలా సన్నిహితుడు. సోషల్ మీడియాలో వాళ్ళకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రకాష్ రాజ్ విమర్శలు చేసిన ప్రతిసారీ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. 'జస్ట్ అస్కింగ్' అంటూ ప్రకాష్ రాజ్ వస్తుంటే... ఆయనకు బండ్ల గణేష్ ఇచ్చే కౌంటర్లు వైరల్ అవుతున్నాయి.
