Balineni : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ మరోసారి తాడేపల్లికి ఆహ్వానించారు. గురువారం భేటీకి రావాలని పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లికి రావాల్సిందిగా బాలినేనికి సీఎం కార్యాలయం సమాచారం పంపింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం జిల్లా విషయంలో పూర్తి స్థాయి బాధ్యతలివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన వర్గం భావిస్తోంది. గతంలో బాలినేని అసంతృప్తికి గురయినా పట్టించుకోలేదు. ఇప్పుడు సర్వే రిపోర్టులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేనికే బాధ్యతలివ్వాలని జగన్ అనుకుంటన్నట్లుగా చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీ మరో సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డికి విబేధాలున్నాయి. తనకు ప్రోటోకాల్ కూడా జిల్లాల్లో సరిగ్గా అందకుండా చేస్తున్నారన్న ఉద్దేశంతో బాలినేని రీజనల్ కో ఆర్డినేటర్ పదవీకి రాజీనామా చేశారు. గతంలో పిలిపించి బుజ్జగించినా బాలినేని అంగీకరించలేదు. తాను నియోజకవర్గానికే పరిమితమవుతానని ప్రకటించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలతో మళ్ళీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవీ చేపట్టాలని బుజ్జగించే అవకాశం అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తాను నియోజకవర్గానికి పరిమితం అవుతానని బాలినేని తేల్చి చెప్పారు. అధికారుల బదిలీ, ప్రోటోకాల్ విషయంలో అవమానాలు జరుగుతున్నాయని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వైవి సుబ్బారెడ్డితో విభేదాలు కారణంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి పరిమితం అయ్యారు.
సీఎం జగన్‌కు ముప్పు - జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రానికి ఇంటలిజెన్స్ నోట్ !
పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పాతిక సంవత్సరాలుగా తాను విలువలతో కూడిన రాజకీయాలను చేస్తోన్నానని, అవే లేకపోతే రాజకీయాల్లో ఉండలేననీ వ్యాఖ్యానించారు. విలువల కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ తేల్చి చెప్పారు. తన జోలికి వస్తే ఊరుకోబోనని, ఎవ్వరినైనా ఎదరిస్తాననీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఆయన జగన్‌ను కలుసుకోబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు, అంగీలు చింపుకుని, చెప్పులతో కొట్టుకున్న కార్యకర్తలు
రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ జెండాలు లేకుండానే ఆయన కార్యక్రమాలు చేపట్టడం చర్చనీయాంశమయింది. అయిేత ిటీవలికాలంలో ఆయన పార్టీ తరపున మాట్లాడుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోపై కూడా ఒక రోజు మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ప్రకటించి, ఆ మేనిఫెస్టోను సైతం అమలు చేయాలని దుస్థితి టిడిపి ప్రభుత్వ పాలనలో కనిపించిందన్నారు. టిడిపి మహానాడు వేదికగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన రకరకాల మేనిఫెస్టోను నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరన్నారు. అధికారం చేజిక్కెంతవరకు అబద్ధపు హామీలను గుప్పించి, ఆ తర్వాత మర్చిపోవడం చంద్రబాబు నైజమన్నారు.