Unstoppable With NBK: ఎన్ని అమావాస్య చీకట్లు కమ్మినా చంద్రుడు మళ్లీ వస్తాడు - ఏపీ రాజకీయాలపై హైవోల్టేజ్ డైలాగ్స్ !

బాలయ్య అన్ స్టాపబుల్ వెర్షన్ లో పరోక్ష పొలిటికల్ డైలాగులు పేలాయి. మొదటి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభమయింది.

Continues below advertisement

Unstoppable With NBK:   ఆహా ఓటీటీలో లిమిటెడ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి. మూడో సీజన్ లో భాగంగా తొలి  ఎపిసోడ్ లో బాలకృష్ణ.. తన సినిమా భగవంత్ కేసరి యూనిట్ తోనే ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఈ షో ఎపిసోడ్ ప్రోమో హైలెట్ అయింది. దాంతో ఎపిసోడ్ లో కొత్తగా ఏం చెప్పారన్నదానిపై ఆసక్తితో ఎక్కువ మంది చూస్తున్నారు. 

Continues below advertisement

ఎవరు ఆపుతారో చూద్దాం ! 
 
ఇటీవలి రాజకీయ పరిణామాలతో  బాలకృష్ణ ఏం మట్లాడతారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.  సినిమా ప్రమోషన్ లాగా  ఎపిసోడ్ ఉంది కాబట్టి నేరగా కాకపోయినా పరోక్షంగా బాలకృష్ణ తాను చెప్పాలనకున్నది చెప్పారు.  మా మాట సుపరిచితం, మా బాట సుపరిచితం. మేము ఏంటో మా వాళ్లేంటో.. మా వెంట ఉండే మీకు సదా నమ్మకం అంటూ.. ప్రారంభించి..   రోజులు మారినా రుతువులు రంగులు మార్చినా.. ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా.. మళ్లీ చంద్రుడు ఉదయిస్తూనే ఉంటాడు. గడ్డుకాలంలో కరుడుగట్టిన గుండె ధైర్యం.. చెడ్డపని చేయలేదు అనే మానసిక స్థైర్యం.. మన జీవితంలో అలుపులేని పోరాటానికి ఊతమిస్తుంది. మరపురాని గెలుపు తీరాలకు చేర్చుతుందన్నారు.  

మేము తప్పు చేయలేని  మీకు తెలుసు !

మేము తప్పు చేయలేదని మీకు తెలుసు. మేము తలవంచమని మీకు తెలుసు. మనల్ని ఆపడానికి ఎవడూ రాలేడని మీకు తెలుసు. మేము మీకు తెలుసు. మా స్థానం మీ మనసు. గుండె బరువెక్కినా.. కన్ను చిలుకు పట్టినా.. చెదరని చిరునవ్వును పెదవికి పూయించే బాలయ్య మీ సొంతం. అనిపించింది అందం. అనుకున్నాది చేద్దాం. ఎవరు ఆపుతాడో చూద్దామని ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చారు. 

ప్రోమోలో ఉన్న పవర్ ఫుల్ డైలాగులకు మరితం  మసాలా ! 

 " సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి". రాష్ట్రం బాగునప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి, మొత్తం నాశనం చేశారని డైలాగ్ లతోనే సెటైర్లు వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని, దాన్ని మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలన్నారు. అంటే ఇక్కడ హీరో చంద్రబాబు అని,  జైలు నుంచి బయటకు వస్తే అంతా సెట్ చేస్తారంటూ కామెంట్ చేశారు.

ముందు ముందు రాజకీయ ఎపిసోడ్స్ ఎక్కువే ! 

బాలకృష్ణ వ్యాఖ్యాత వ్యవహరించిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో మొదటి ఎపిసోడ్ లో భగవంత్‌ కేసరి చిత్ర బృందంతో కలిసి సందడి చేశారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దసరా కానుకగా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత ఎపిసోడ్స్ లో .. బాలకృష్ణ నుంచి మరింత ఎక్కువ పొలిటికల్ డైలాగ్స్ వచ్చే అవకాశం ఉంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola