Ayyanna On Police :  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతల్ని బెదిరిస్తున్నట్లుగా ఐపీఎస్ ఆఫీసర్లను కూడా బెదిరిస్తున్నారా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు అధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు.  నర్సీపట్నం పోలీసులు వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్  పైనుంచి దూకిన..  సంతోష్,  కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  హెచ్ఆర్సీ ఆదేశాల ప్రకారం , బాధితుడికి వెంటనే రెండు లక్షలు చెల్లించాలన్నారు. అప్పటి ఏ ఎస్ పి రిషాంత్  రెడ్డి తో పాటుగా సంబంధించిన పోలీసు అధికారులు పై కేసు నమోదు చేయాలన్నారు.  లోకేష్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారని చెప్పి.. అప్పట్లో   నర్సీపట్నంలో  ఏఎస్పీగా ఉన్న రిషాంత్ రెడ్డి కొంత మంది యుువకుల్ని స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు.  ఆ సమయంలో ఎల్లేటి సంతోష్ స్టేషన్ పై నుంచి పడిపోయారు. దీనిపై సంతోష్ తల్లి హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో.. పోలీసుల తప్పు ఉందని నిర్ధారించి.. రూ. రెండు లక్షలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. 


మంచి అధికారులు కూడా చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారన్న అయ్యన్న 


ఆంధ్రప్రదేశ్‌కు సివిల్ సర్వీస్ అధికారులు మూల స్తంభాల లాంటి వాళ్లని.. మంచి నిర్ణయాలు తీసుకోవాలన్న అయ్యన్నపాత్రుడు సూచించారు. కానీ కొంత మంది ఐపీఎస్ అధికారులు మాత్రం పూర్తిగా దారి తప్పారన్నారు. సీఐడీ  సునీల్ కుమార్ మంచి ఆఫీసర్ కానీ  ముఖ్యమంత్రి ఒత్తిళ్లు తట్టుకోలేక టీడీపీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.  ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఎందుకు అలా తయారయ్యారో చెప్పాలన్నారు. సిద్ధార్థ కౌశల్..   త్రివిక్రమ్ వర్మ. మంచి అధికారులని.. . గుడివాడ నాని విషయంలో,జోగి రమేష్ వ్యవహారంలో ఎందుకలా వ్యవహరించారు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.  తప్పుని తప్పని చెప్పలేని వారు.. ఆఫీసర్లుగా ఎలా ఉండగలుగుతున్నారని ప్రశఅనించారు. 


ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారని వృత్తికి.. ప్రజలకి ద్రోహం చేస్తారా ? 


నాడు ఐపీఎస్ ఆఫీసర్లు ఎంత సిన్సియర్‌గా ఉండేవాళ్లో నేటి ఐపీఎస్ ఆఫీసర్లు గుర్తు చేసుకోవాలన్నారు.  మమ్మల్ని బెదిరించినట్లు, మిమ్మల్ని  కూడా ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారా..?  ప్రజలకి ..  వృత్తికి  ద్రోహం చేస్తారా అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. జనామోదం  ఉన్న  ముఖ్యమంత్రయితే, డేరాల కట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అయ్యన్న ఎద్దేవా చేశారు. తాను  చాలామంది ముఖ్యమంత్రి లతో పని చేశాను. ఇంతా  వరస్ ముఖ్యమంత్రిని చూడలేదని స్పష్టం చేశారు.  గంజాయిలో అసలు దొంగలను మాత్రం ఇప్పుడు పట్టుకోవడం లేదన్నారు.  గంజాయి తగ్గుతుంది అంటూ తప్పుడు ప్రచారం చేయడం తప్పన్నారు. 


భూరక్ష పథకం రాళ్లపై బొమ్మలు చూస్తూంటే పిచ్చి ముదిరిందనిపిస్తోంది ? 


ముఖ్యమంత్రి ప్రారంభించిన భూ రక్ష పథకం వల్ల గ్రామాల్లో గొడవలు పెరుగుతాయే తప్ప.. ప్రయోజనం ఉండదన్నారు.  సర్వే కన్నా సర్వే రాళ్ల మీద బొమ్మకు ఎక్కువ ఖర్చవుతుందన్నారు.  దీన్ని చూస్తుంటే పిచ్చి ముదిరింది అనిపిస్తుందని అయ్యన్న విమర్శించారు. 


మరోసారి మోదీతో సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం - డిసెంబర్ 5న ఢిల్లీలో ఏం జరగనుంది?