YS Viveka Case :  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు.   మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన ఈ విచారణకు హాజరయ్యారు.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి.


ముందస్తు బెయిల్ షరతుల్లో ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరు కావాలని షరతు                                               


వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్  రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు జూరు చేస్తూ వెకేషన్ బెంచ్ తీర్పునిచ్చింది. అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై పలు దఫాలుగా సుధీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం..షరతులతో కూడి బెయిల్ ఇచ్చింది. ప్రతి శనివారం  సీబీఐ విచారణకు హాజరుకావాలని చెప్పింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని సూచించింది.  వివేక హత్య కేసులో విచారణ నుంచి  అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్టైంది.


ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా ఏపీ వాళ్లు మృతి - వివరాలు తెలుసుకుంటున్నామని సీఎం ప్రకటన


అవినాష్ రెడ్డికి కోర్టు షరతులు                           


రూ. 5లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలు
జూన్ 19 వరకు ప్రతి  శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలి
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల మధ్య విచారణకు హాజరు కావాలి
సీబీఐ పర్మిషన్ లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు
బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచన


ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!                           


వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక వసతులు                                          


హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక కేటగిరి విచారణ ఖైదీగా చూడాలని సీబీఐ కోర్టు సూచించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఇదివరకే అరెస్టైన భాస్కర్ రెడ్డి.. తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలన్న ఆయన అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. ఏప్రిల్ 16 నుంచి ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నారు.