Chandrababu To Delhi :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన డిల్లీకి చేరుకుని సాయంత్రం అమిత్ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.   శనివారం ఉదయం వరకూ ఆయన ఢిల్లీ పర్యటన గురించి సీక్రెట్ గానే ఉంది.  ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అధికార పదవల్లో లేరు కాబట్టి  అధికారిక విషయాలు చర్చించే అవకాశం లేదు. కేవలం రాజకీయ అంశాలపై మాత్రమే చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానించే ఉద్దేశంలో అమిత్ షా, మోదీ ఉన్నారని చెబుతున్నారు. 


చివరి క్షణం వరకూ రహస్యంగానే చంద్రబాబు ఢిల్లీ టూర్ 


ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వతా  టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని తానే ఎన్డీఏలో చేరుతానని సీఎం జగన్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోం అయితే అనూహ్యంగా చంద్రబాబు  మోదీ, షాలతో భేటీకి ఢిల్లీకి వెళ్లడంతో రాజకీయంగా కీలక పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా అన్న చర్చ జరుగుతోంది.  ఇటీవల పలు సందర్భాల్ల మోదీ విధానాలను తాను సమర్థిస్తానని .. ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు.  ఏపీలో వైసీపీ విముక్త పాలన కోసం.. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలసి వస్తుందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అయితే  బీజేపీ వైపు నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందనా లేదు. 


తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ


2014 కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందనే ప్రచారం                             


2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేశాయి. జనసేన మద్దతు ఇచ్చింది. 2019 నాటికి మూడు పార్టీలు ఎవరికి వారు పోటీ చేశాయి. దీంతో టీడీపీ ఓడిపోయింది. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ పూర్తి స్థాయిలో  వేధింపులకు పాల్పడటం.. రాష్ట్రాన్ని నాశనం చేశారన్న  అభిప్రాయంతో మరోసార వైసీపీ గెలవకూడదన్న ఉద్దేశంతో  ఓట్లు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు.  బీజేపీ కూడా కలసి వస్తుందని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనలో ఇదే అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లుగా కూడా పవన్ చెప్పారు. 


ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు


పొత్తుల అంశం ఓ కొలిక్కి వస్తుందా ? 


ఇప్పుడు చంద్రబాబు ..  అమిత్ షా, మోదీలతో సమావేశానికి వెళ్లడంతో.. ఈ పొత్తుల అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మారుతున్న జాతీయ రాజకీయాల కారణంగా చంద్రబాబు అనుభవాన్ని ఉపయోగించుకోవాలని మోదీ, అమిత్ షా కూడా భావిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే ఏపీలో పూర్తిగా సహకరించే ప్రభుత్వం ఉండటంతో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.