Chittoor Attack On TDP :  తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ నతేలపై వైఎస్ఆర్‌సీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరూ జిల్లా సోమల మండలంలో పెద్ద ఉప్పరపల్లి, నంజంపేట గ్రామాల్లో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా బాబు నేతృత్వంలో ిదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం  నిర్వహించారు. అయితే నంజం పేట వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులు కూడా సర్ది చెప్పకపోవడంతో వివాదం పెరిగింది. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు టీడీపీ కార్యకర్తలు గాయాలయ్యాయి. తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. టీడీపీ నేతలు కార్యక్రమం చేయకుండా పంపించేశారు.  


 





 


పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలపై వరుస దాడులు


పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు ఏ రాజకీయ కార్యక్రమం చేయాలన్నా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడులకు దిగుతూనే ఉంటారు. ఇటీవల మాజీ జనసేన నేత, పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్.. రైతు సదస్సును సామల మండలంలోనే పెట్టాలనుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆయనను అడ్డుకున్నారు. కార్యకర్తలంతా వెళ్లిపోయిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేశారు. బీభత్సం సృష్టించారు. అయితే పోలీసులు ఏ మాత్రం అడ్డుకోలేదు. ఇలాంటి దాడులకు పోలీసులు కూడా సహకారం అందించారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. 


ఏ కార్యక్రమం చేపట్టాలన్నా భయం.. భయమే 


అదే సమయంలో జనసేన, టీడీపీలకు చెందిన నేతలపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూనే ఉంటారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా..  ఈ దాడుల భయం ఉంటుంది. పోలీసులు కూడా దాడులు జరిగుతాయని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోరన్న విమర్శలు ఉన్నాయి. దాడులు జరుగిన తర్వాత... జరగాల్సిన విధ్వంసం జరిగిన తర్వాతే స్పందిస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో పరిస్థితులు మారడం లేదు. 
 


పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నంది  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


పుంగనూరు నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన అనుచరుల్ని ఇలా ప్రతిపక్షాలపై దాడులకు ప్రోత్సహిస్తారన్న ఆరోపణలను విపక్ష పార్టీల నేతలు చేస్తూంటారు. తనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య నిరసనలు చేపట్టినా ఆయన ఊరుకోరని... దాడులకు ఆదేశాలిస్తారని అంటున్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేత చల్లా బాబు, జనసేన నేతలు కూడా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. దాడులు జరుగుతున్నా.. తమ పోరాటం కొనసాగిస్తున్నారు. 


అమ్మ చిన్నతనమంతా పేదరికమే, పక్కింట్లో అంట్లు కడిగి మమ్మల్ని పోషించింది - ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ