Atchannaidu made controversial comments on scheme: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాలు అన్నీ అమలు చేశామని.. ఇంకా ఒక్కటే మిగిలి ఉందన్నారు. ఆడబిడ్డ కు నెలకు 1500 ఇచ్చే పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీ ను అమ్మాలని వ్యాఖ్యానించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ పథకం అమలుపై ఆలోచన చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొని అచ్చెననాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వంపై మండపడ్డారు. ఆ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోతే ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు.
అయితే వైసీపీ నేతలు, సోషల్ మీడియా అచ్చెన్నాయుడు ఆ పథకం అమలు ఎంత కష్టమో అన్నది ఉదాహరణగా మాత్రమే చెప్పారని.. అంత భారం పడుతున్నా సరే చంద్రబాబునాయుడు ఆ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. అచ్చెన్నాయుడు అంటున్నారు. అయితే.. అమలు చేయడాలంటే.. రాష్ట్రాన్ని అమ్మేయాలని అన్నారు కాబట్ిట.. ఇక పథకం అమలు విషయంలో చేతులెత్తేశారని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. మరుమూల ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం అచ్చెన్నాయుడు శైలి అని.. దాన్ని ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే మహిళల్ని మరోసారి మోసం చేశారని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తోంది.
యాథాలాపంగా చేసే వ్యాఖ్యలతో టీడీపీకి సమస్యలు ఏర్పడుతున్నాయి. అచ్చెన్నాయుడు గతంలో కూడా కొన్ని కామెంట్లు వైరల్ అయ్యాయి. విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పగల వాగ్దాటి ఉండే నేతల్లో ఒకరయిన అచ్చెన్నాయుడు.. పథకం అమలు ఎంత కష్టమో చెప్పేందుకు తీసుకున్న ఉదాహరణ.. మిస్ ఫైర్ అయిన సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ వర్గాలంటున్నాయి.