Praise for Ashok Gajapathi Raju:    గవర్నర్ పదవి వస్తుందని అసలు ఊహించలేదని అశోక్ గజపతిరాజు అన్నారు. గోవా గవర్నర్ గా ఆయన పేరును ప్రకటించిన తర్వాత విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. గవర్నర్ పదవి ఇస్తారని.. కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నా.. తాను ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదన్నారు. ఏవియేషన్ మిసన్టర్ గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించానన్నారు.  

పదవి ప్రకటించిన తర్వాత విజయనగరం కోటలో ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చి  శుభాకాంక్షలు తెలిపారు.  

అశోక్ గజపతిరాజుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  టీడీపీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు .. అశోక్ సాధించిన ఘనత గర్వకారణం అన్నారు.  

అద్వితీయమైన రాజకీయ అనుభవం, పాలనా నైపుణ్యం, రాజధర్మం పట్ల నిబద్ధతతో ఆయన ఇప్పటివరకు ఎన్నో బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించారు. దేశ రాజకీయాల్లో తెలుగుజాతికి గౌరవం తీసుకువచ్చే ఈ నియామకం ప్రతి తెలుగు వారికీ గర్వకారణమని పలువురు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. 

2014 నుండి 2018 వరకు మేము NDA మంత్రివర్గంలో సహచరులుగా పనిచేశామని ఆయన తన పాత్రను సమర్థంగా నిర్వహిస్తారని మాజీ కేంద్ర మంత్రి సురేష్, ప్రభు తెలుగులో  తన సందేశాన్ని పోస్టు చేశారు.